నీకేం తక్కువ? నువ్వు అందరికన్నా ఎక్కువే .....భావుకతలో ....
ప్రతికథకు
మరెన్నో వ్యధలు
కథ మార్చేదెవరు?
వ్యధ తీర్చేదెవరు?
రాయి తగిలితే
నొప్పిరానిదెవ్వరికి
గుండె పగిలితే
కన్నీరు పొంగనిదెందరికి?
జీవితమన్నాక....జీవిస్తున్నాక..
కష్టం రాకుండాఉంటుందా?...
దాని వెనకే కదా సుకముండేది?
ఓ సుఖం వచ్చి
ఆ కష్టాన్ని కష్టపెట్టకపోతుందా
ఏదైనా మనసులోంచే కదా రావాలి !
ఏదైనా మనసులోంచే కదా రావాలి !
ప్రేమయినా......
మార్పయినా ....
మరేదయినా .....
మాములు మనిషికి
ఇంతకన్నా
ఇంకా ఏం కావాలి సాంత్వన తప్ప ?
మనిషి మనిషికి తేడా ఉన్నట్లే
అనుభవంలోను ఆ స్వాదనలోను
మరి తేడాలంటూ ఉండవా?.....
అభిరుచి ఉండాలే కాని...
అనుభవంలోను ఆ స్వాదనలోను
మరి తేడాలంటూ ఉండవా?.....
అభిరుచి ఉండాలే కాని...
అన్నీ మన అందుబాటులోనే ...........
ఆకాశం నేల వాలదా ?.....
ఆకాశం నేల వాలదా ?.....
ఆశలు చిగురించవా....
ఫలితాలు పండవా....
కొమ్మన పూలన్నీ ఆహ్వానం పలకవా!
ఒక్కసారి మనసు లోతుల్లోకి తొంగిచూడు
ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు, అనుభవాలు, ఆహ్వానాలు...
నీకేం తక్కువ? నువ్వు అందరికన్నా ఎక్కువే .....
కొమ్మన పూలన్నీ ఆహ్వానం పలకవా!
ఒక్కసారి మనసు లోతుల్లోకి తొంగిచూడు
ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు, అనుభవాలు, ఆహ్వానాలు...
నీకేం తక్కువ? నువ్వు అందరికన్నా ఎక్కువే .....

No comments:
Post a Comment