Tuesday, November 13, 2012

కాలం గాలిలో ఇంకిపోతోంది


నే చెప్పినట్టు ఏదీ జరగదే ....











నిజం తెలుసునా ?

చెట్టు చిగురు తోడుగుతోంది.

ఆకు ఎండి నేల రాలుతోంది .

రాయి వీర గర్వంతో మిడిసి పడుతోంది

ఆకాశం మబ్బుల్లో తేలుతోంది


కలం ఇంకు కారుతోంది

కాలం గాలిలో ఇంకిపోతోంది

పక్షి పంజరాన్ని దాటుతోంది

ఆకాశం నేలకు ఒరుగుతోంది

నిద్ర చీకటితో చెలగాట మాడుతోంది

హాయి పరుపులతో లాలుచి  పడుతోంది

రావడం పోవడం అంతా

ఎవరో చెప్పినట్టు  జరుగుతోంది

నే చెప్పినట్టు ఏదీ జరగదే ....

మన జీవితాన్ని ఎవరు నడుపుతోంది?


మన వెనక అజ్ఞాతంగా ఉన్నది ఎవరింతకు?.. 

వాకిలి ముంగిట వెలుగులు

ఏమని చెప్పను ఎలా చెప్పను ?


















సూర్య కిరణ సౌరభాలు

వాకిలి ముంగిట వెలుగులు


పెదవులపై చిరు చెమటలు

కాలి బొటన వేలుపై రోమ రౌద్రం

అలసిన కాలిబాటకి చిరు సేద

పవళించిన ముద్ద బంతికి

బడలిక తీరే మెలకువ

ఏమని చెప్పను మనో కదలిక

ఆగలేక పోతోంది పరుగును మరచిన కడలి

జీవితమన్నాక కష్టం రాకుండాఉంటుందా


నీకేం తక్కువ? నువ్వు అందరికన్నా ఎక్కువే .....భావుకతలో .... 

ఎద ఎదకు 

ఎన్నెన్నో కథలు

ప్రతికథకు 


మరెన్నో వ్యధలు

కథ మార్చేదెవరు?


వ్యధ తీర్చేదెవరు?

రాయి తగిలితే 


నొప్పిరానిదెవ్వరికి

గుండె పగిలితే 


కన్నీరు పొంగనిదెందరికి?

జీవితమన్నాక....జీవిస్తున్నాక.. 


కష్టం రాకుండాఉంటుందా?... 

దాని వెనకే కదా సుకముండేది?

ఓ సుఖం వచ్చి 

ఆ కష్టాన్ని కష్టపెట్టకపోతుందా

ఏదైనా మనసులోంచే కదా రావాలి !

ప్రేమయినా...... 

మార్పయినా .... 

మరేదయినా ..... 

మాములు మనిషికి  

ఇంతకన్నా 

ఇంకా  ఏం కావాలి సాంత్వన తప్ప ?




మనిషి మనిషికి తేడా ఉన్నట్లే 

అనుభవంలోను ఆ స్వాదనలోను 

మరి తేడాలంటూ ఉండవా?.....

అభిరుచి ఉండాలే కాని... 

అన్నీ మన  అందుబాటులోనే ...........

ఆకాశం నేల వాలదా ?..... 

ఆశలు చిగురించవా.... 

ఫలితాలు పండవా.... 
కొమ్మన పూలన్నీ ఆహ్వానం పలకవా!

ఒక్కసారి మనసు లోతుల్లోకి తొంగిచూడు

ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు, అనుభవాలు, ఆహ్వానాలు...

నీకేం తక్కువ? నువ్వు అందరికన్నా ఎక్కువే .....

సత్యానికి ఎదురు లేదు.......

సత్యమంటే దైవమే ........

సత్యానికి ఎదురు లేదు.......

అలుపు అనేదే లేదు.....

విడుపు అంతకన్నా లేదు .........
అదురు లేదు - బెదురూ లేదు .........
దానికి నిదురే లేదు ....... 

అది మనిషి కాదుగా !
సత్యానికి ఎదురు నిలువలేవు ........
దాన్ని తప్పించుకో లేవు !

దానికి లొంగావా...... సరే సరి !
ఎదురు తిరిగావా...... అదో గతే !.....
ఎన్నటికైనా ఎలాగైనా 

కడదాకా నిలబడేది సత్యమే .......
సదా సత్యాన్ని పాటించు.....
సద్గతిని పొందు .........
మోక్షాన్ని అవలీలగా అందు ........

Monday, November 12, 2012

రాదిక నీ కోసం..... ఆ అవకాశం

మనసున ఉన్నది ఆచరణలోకి రావాలి !

హృదయంలో ఉన్నది పలుకుగా వెలగాలి !!

నీకుగా ఉన్నది ఎవరికో చెందాలి !



మౌనిగా ఉంటూనే మత్తుగా ఒత్తాలి  !!

చెత్తగా జీవిస్తు స్వేచ్చగా ఎగరాలి !



మత్తుగా జోగుతూ కలల్లో తేలాలి !!

హాయిగా పయనిస్తు బడలిక నోడాలి !



తెలుసా నీకు ? ఆకాశమే నీ  హద్దని !

జీవితం ఎంత విలువైనదో నీకు వేరొకరు  చెప్పాలా?


తెలుసుకో ఈ అవకాశం ఇక రాదని ... రానే రాదనీ ... !!

విశ్వాసమే నీ  ఆయుధం ..



వినయమే నీ సౌభాగ్యం


మరువకుమేనాడు  మనోగతాన్ని...


జారనీకు  నీ నమ్మకాన్ని