Monday, January 23, 2012

ఎక్కువైనా ఇబ్బందే ........


మనకు ఏది ఎక్కువైనాఇబ్బందే.......

కొద్దిగా తక్కువైనా భాదే.....

ఏదైనా అదుపులో ఉంటేనే హాయి ....

మనం పరిధిలో ఉంటేనే పదిలం ......

చల్లని నీటిని తాకలేము .......

చల్లని మనసుతో ఆలోచించు..... 

మసిలే వాటిని అసలే ముట్టలేము......

గుండెలో ఆమంటలు దేనికని ?.....

ఎండలో ఎంతసేపని పడుకోగలము ?......

దేనికి అంత తొందర ?...ఓపిక వద్దా! 

తడిసే వానలో కాసేపైన ఉండగలమా ?.....

ఏదీ తట్టుకోలేనప్పుడు ఇక సాదించడానికి మిగిలేదేంటి ?.....

పనితో కదా మొదలయ్యేది పయనం.....

దారిలో ఏం జరిగినా ఎందుకు జరిగినా అగమాకు!

శ్రమకు వెరవక కడదాకా జరిగితేనే వెలుగు! 





గెలుపెవరిది ?..........

గెలుపనేది నీ మనసుకు తెలుసును.......

ఆడుతూ పాడుతూ నేలంతా తిరిగే చిన్నారిదా ?......

రెక్కలు ఆడిస్తూ, గాలిని తోస్తూ  ముందుకు సాగే పక్షిదా ?....

తెల్లవారగానే నలు చెరగుల వెలుగును పంచె భానుడిదా........ 

పేదవాడి ముఖంలో వెల్గులు ప్రసరించినపుడు కదా గెలుపు.....

అతగాడి ఆనందానికి నీవే  కారణమైతే గెలుపు నీదే  కదా!
చెప్పడానికి విద్డూరంగా ఉన్నామనసుకే గెలుపు!

మనసును అదుపులోకి తెచ్చుకో! విజయాన్ని హృదయంతో గెలుచుకో !
లోపల ఏ చేడూ లేనప్పుడే నీకన్నీ సుఖాలే ఎదురవుతాయి....

చక్కని సంగతులు నీ కెప్పుడూ తోడుగానే వుంటాయి.....
వినగలిగే హృదయం నీలో పరుచుకున్నపుడు..... 
చూడండి ........

Thursday, January 19, 2012

ఆలోచించి అడుగు ముందుకెయ్............

మంచి మాటను ఎవరు చెప్పినా పాటించు .....
అది నీకు చేసే మేలు ఇంకె వరూ చేయలేరు.... 

ఈ ప్రపంచంలో ఏది చేయబోయినా ఆలోచించి చేయి ......
ఆలోచనే లేకపోతే ఆ పనికి అసలు అర్ధమే లేదు..... 

అడుగు ముందుకేసే ముందు వెనకడుడు వివరాలు తెలుసుకో ...... 
ఆచితూచి అడుగేయమన్నారు ఎందుకోకూడా ఆలోచించు ...... 

మరో మారు ఆలోచించి అడుగు ముందుకెయ్ .......
సాధక భాదకాలు అన్నీ  క్షున్నంగా తెలుసుకో ...... 

ఒంటరి తనమే నీ బలం!

ఎవరూ లేరని చింత పడకు ........
ఎవరూ రాలేదని బెంగ పడకు....... 

ఉన్నవారందరూ రేపటికైనా పోయే వాళ్ళే.....
ఒకరు ముందు .......
మరొకరు వెనకాల .........
తేడా అదొక్కటే !

ఒంటరి తనమే నీ బలం!
జంట కోరితే కొంత నయం!!

స్వేచ్చ  ఎవరికుందని ?.........
నీకీ లేదనుకుంటున్నావా?......

ఉన్నా ఏం పనికొస్తుందని ?.......
ఉన్నా లేనట్లే .......
లేకున్నా బాగుండేదేమో .......


మనసు పక్షిలా ఎగరాలంటే.....
స్వేచ్చ అక్కర్లేదు...సాహసం కావాలి!   

జీవితమంతా భయం కౌగిట్లోనే .........
అడుగు ముందు కేయాలన్నా అదురే .......

వెనకడుగు  వేసామా........
లోయలోకి జారుడే ...........

నడవ గలిగి కదల లేని స్థితి....... 
ఎంతటి నరకమది ?.........

అవసరమా మనకంతటి పెచ్చు ......
పిచ్చి గాక పోతే పచ్చి నిజం ఇదే కదా !
మరచి పోగలమా .....కలనైనా .......



Helping others is always a good deed for you


If you choose helping as a profession.......
You will be rewarded a lot from god.....

Many people in this world are in need of many things.... like food, clothes, money, shelter etc.... Are you able to lift them?.....

Please think about others once every day..........
Try to help them in any need!


If you have lot of money with you.............. 
Please help the people who are actually in grief and in need of money...............

Don't try to go away far from doing good things....... 
God always watch your doings every moment....