Wednesday, November 9, 2016

Thursday, August 4, 2016

కృష్ణవేణిపుష్కరాలు

పుష్కరాలు
తతో గోదావరీం రమ్యాం కృష్ణవేణీం మహానదీం ।
వరదాంచ మహాభాగాం మహోరగనిషేవితామ్‌ ॥
    ఇది మంగళప్రదమైన శ్రీరామాయణంలో కృష్ణానదీ ప్రస్తావనం. సుగ్రీవుడు హనుమంతునికి దక్షిణ భారతంలోని ప్రదేశాను, నదును వివరిస్తూ

చేసిన శుభప్రస్తావనం.
అత్ర జన్మ సహస్రాణాం సహస్త్రైరపిసత్తమ ।
కదాచ్లిభతే జన్తు ర్మానుష్యం పుణ్యసఞ్చయాత్‌ ॥
    వేలాది జన్మ పుణ్యఫం వన పరమపవిత్రమైన భారతదేశంలో మానవు జన్మిస్తారట. జంబూద్వీపమునందని దేశము అన్నింటి కంటెనూ

భారతదేశము సర్వశ్రేష్ఠము. ఇతర దేశాు కేవము భోగస్థానము. కాని భారతదేశము మాత్రము కర్మభూమి. ఇచ్చట మానవుడు సత్కర్మను

ఆచరించుట వన భోగమును, మోక్షమును కూడా పొందగ్గుతున్నాడు.
తత్రాపి భారతం శ్రేష్ఠ జమ్భూద్వీపే మహామునే
యతో హి కర్మభూరేషా తతోన్యాభోగభూమయ: ।
    వేదకాం నుంచి జలాు మనకు దేవతు.
    జమును పవిత్రము చేయుకామే పుష్కరము. ఈ పుష్కరకామందు సమస్త దేవతు, ఋషు, పితయి, మూడున్నరకోట్ల తీర్థము ఆయా నదీ

జముతో కూడి హితమును కల్గిస్తాయి. కావున అట్టి    శుభ సమయమున స్నాన, దాన, జప, హోమ, అర్చన, పిండ ప్రదానాది వైదిక కర్మను

ఆచరించడం వన మహోన్నతమైన ఫము భించును.
    సూర్యుడు పండ్రెండు రాశులో ఒక్కొక్క రాశి యందు ప్రవేశించినపుడు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరము ఏర్పడును.
    ఈ సంవత్సరం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినపుడు కృష్ణాపుష్కరము జరుగును. కృష్ణానది సహ్యాద్రి పర్వతము నుండి ప్రవహిస్తూ

దివిసీమలో హంసదీవి వద్ద సముద్రంలో కలియుచున్నది.
    కృష్ణవేణికి ఏడు ఉపనదున్నాయి. 1. కృష్ణ, 2. వేణి, 3. తుంగ, 4. భద్ర, 5. భీమ, 6. రథి, 7. భవనాశిని. ఈ ఏడు ఉపనదు సంగమేశ్వరంలో భవనాశి

నదిలో కలిసి పిమ్మట కృష్ణానదిలో కుస్తాయి.
            నమామి సుకృతశ్రేణీం కృష్ణవేణీం తరంగిణీమ్‌ ।
            యద్వీక్షణం కోటిజన్మకృత దుష్కరశిక్షణమ్‌ ॥
    పుష్కరసమయంలో నదీజలాు ఆధిదైవిక తేజస్సు పొంది వుంటాయని ఆ పుష్కర దినాల్లో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ,

తర్పణాది అనుష్ఠానాను పితృదేవతకు పిండప్రదానాను చేయాని మహర్షు ప్రబోధించారు. ఈ పుష్కర మహా కాంలో భూమిమీద గ సర్వ తీర్థాు

పుష్కరం జరిగే నదీ తీరాన చేరి తమ పవిత్రతను అభివృద్ధి చేసుకుంటాయి. ఆ పవిత్ర సమయంలో దేవతంతా సతీసమేతులై ఆ పుష్కరనదీ జలాల్లో

వుంటారు.
    ‘‘అపోవా ఇదగ్‌ం సర్వం విశ్వా భూతాన్యాప:’’ ఈ సృష్టి సమస్తం జతత్వాన్ని కలిగి ఉంది. సమస్త ప్రాణికోటు నీటినుండే ఉద్భవించడం,

జీవించడం జరుగుతోందని వేదం చెబుతోంది. ‘‘యో-పాం పుష్పం వేద పుష్పవాన్‌ ప్రజావాన్‌ పశుమాన్‌ భవతి’’ అని మంత్రపుష్పం చెబుతోంది. ఎవడైతే

జతత్వాన్ని తొసుకుంటాడో వాడు బవంతుడు, సంతానవంతుడు, పశుసంపత్‌ సంపన్నుడు అవుతాడు అని అర్థం. సృష్టి ఆరంభంలో ఏకార్ణవాకారంతో

జం సర్వవ్యాప్తమై ఉందనీ, అందునుండే సృష్టి ప్రారంభమైందనీ పురాణాు ఉద్ఘోషిస్తున్నాయి. ‘‘అప: పునంతు పృథివీం పృథివీ పునాతు మాం’’

అంటున్నది వేదం. జీవకోటి నీటివ్లనే పరిశుద్ధమవుతుంది.
    పుష్కరము అనే పదానికి వ్యుత్పత్తి పోషించునది. పుష్ణాతీతి పుష్కరమ్‌. పుష్కరమంటే కమండం. పుష్కరమంటే పద్మం. పుష్కరమంటే

ఏనుగుతొండం. పుష్కరమంటే మహాక్ష్మి. శ్రీమన్నారాయణునకు పుష్కరాక్షుడని, క్ష్మిదేవికి పుష్కరాసన అని పేర్లున్నాయి. సముద్రునకు పుష్కర

నియుడనిపేరుంది. ప్రాణును అన్నింటినీ తమ జ సంపద ద్వారా నదు బ్రతికిస్తూ ఉంటే ఆ నదును సహితం వాటి శక్తి క్షీణించకుండా రక్షిస్తున్న వాడు

పుష్కరుడు.

కృష్ణానది పరీవాహకతీరం
    కృష్ణానది సహ్యాద్రి పర్వతాగ్రమునుండి ప్రవహించుచూ మహాబలేశ్వర క్షేత్రమున భూమియందు ప్రవేశించింది. వేదగిరి అను పర్వత

శిఖరాగ్రమున ఆమక వృక్షము నుంచి వేణి నది జనించెను. పర్వతా మీద కొంత దూరం ప్రవహించి సతారా అను ప్రాంతమున కృష్ణను కలిసెను. ఈ

ప్రాంతము కృష్ణ వేణి సంగమం అని ప్రశస్తి పొందియున్నది. బ్రహ్మశిఖరమునకు దక్షిణమునుండి కకుద్మతీ నది బయుదేరి కృష్ణవేణిలో కలిసినది. ఈ

ప్రకారంగా కృష్ణవేణి సహ్యాద్రి పర్వతము నుంచి ప్రవహిస్తూ 60 నదీ, నదమును అనేక వాగును వంకను కుపుకొనుచూ అనేక ప్రాంతములో పంటకు,

త్రాగునీటికి ఉపయోగపడుతూ అనేక పుణ్యక్షేత్రము యందు ప్రవహించుచూ కృష్ణాజిల్లా హంసదీవి వద్ద సాగరమునందు కలియుచున్నది.

కృష్ణవేణినది పశ్చిమకనుమల్లో మహాబలేశ్వరాన గోముఖం నుండి ఒక ఊట కొనులో జన్మించినది. కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతూ మహారాష్ట్ర,

కర్ణాటకల్లో 560 కి.మీ. ప్రవహించి మహబూబ్‌ నగర్‌  జిల్లా అంపురం దగ్గర తెంగాణలో ప్రవేశిస్తోంది.
    ఆంధ్రప్రదేశ్‌లో 720 కి.మీ. దూరం ప్రవహించి కృష్ణాజిల్లా పులిగడ్డ వద్ద రెండు పాయుగా చీలి ఏటిమొగ, ఎదురుమొండి దగ్గర సముద్రంలో

కుస్తోంది. కృష్ణానదికి అనేక ఉపనదున్నాయి. దిండి, మూసి, పాలేరు, మున్నేరు, తంగభద్ర వాటిల్లో ప్రముఖమైనవి. కృష్ణానది అంపురం వద్ద తెంగాణలో

ప్రవేశించినపుడు ఉత్తరదిశగా ప్రవహిస్తుంది. కృష్ణానది శ్రీశైం వద్ద న్లమ కొండ మధ్యగా ఒక సన్నని కనుమ గుండా ప్రవహిస్తుంది. శ్రీశైం నుంచి

కృష్ణానది తూర్పుగా ప్రవహించి నాగార్జునాసాగర్‌ చేరుకుంటుంది. ఇది ప్రాచీన బౌద్ధక్షేత్రం. ఆచార్య నాగార్జునుడు ఇక్కడివాడే. నాగార్జునకొండ దాటి

కృష్ణానది అమరావతి క్షేత్రం చేరుకుంటుంది. ఇది ప్రాచీన బౌద్ధక్షేత్రం. కొంతకాలానికి బౌద్ధమతం క్షీణించి వైదిక మత ప్రాబ్యం పెరగడంతో

తూర్పుచాణక్యరాజు భీమదేవుడు ఇక్కడ అమరేశ్వరాయాన్ని నిర్మించినట్టు శాసనాు తొపుతున్నాయి. అమరావతి దాటాక కృష్ణానది పులిచింత

దగ్గర మైదానాల్లో ప్రవేశిస్తుంది. విజయవాడ మీదుగా సముద్రం వైపు పయనిస్తూ పులిగడ్డ దగ్గర రెండు పాయవుతుంది. ఈ రెండు పాయ మధ్య

ప్రాంతమే దివిసీమ. మరి కొంతదూరం ప్రవహించి మూడు పాయుగా చీలి కృష్ణవేణి సముద్రంలో కుస్తుంది.
    కృష్ణానది విశ్వరూపిణిగా లోక ప్రసిద్ధి. లోకాను తరింపజేయటానికి కృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన అశ్వత్థ వృక్షరూపంలో నిలిచాడని, ఆ చెట్టు

వ్రేళ్ళ నుండి కృష్ణానది అవతరించిందని ఐతిహ్యం. మహారాష్ట్ర, కర్ణాటక, తెంగాణ, ఆంధ్రరాష్ట్రా చారిత్రక సాంస్కృతిక జీవనంలో ఈ నది ప్రముఖస్థానం

పొందింది.
కృష్ణాతీరమందలి పుణ్య క్షేత్రాు:      తీర్థమంటే పుణ్యక్షేత్ర మన్నమాట.
మహారాష్ట్ట్రము:  కృష్ణ పుట్టిన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహాబలేశ్వరం వద్ద కృష్ణ అవతరించినందున కృష్ణమాత పేరున మందిరం కట్టబడిరది.
నర్సోబాడ :
    కృష్ణవేణీ హృదయంగా పేర్కొనబడే నర్సోబాడ (గాణుగాపురం) సమీపంలో భీమానది కుస్తుంది. యీ సంగమస్థానం అతి పవిత్రమైనది.
సహ్యాద్రి పర్వతము:
    సహ్యాద్రిపైన ఉద్భవించిన కృష్ణానదిలో పరశురాముడు సుస్నాతుడై తండ్రి అయిన జమదగ్నికి ఉత్తరప్రక్రియు నిర్వర్తించాడు. యీ

కర్మకాండను శ్రీదత్తాత్రయువారు పూర్తి చేయించారు. ఈ సహ్యాద్రిపై కృష్ణానదిలో తీర్థస్నానం చేసిన వారికి పాపనివృత్తి ద్వారా పుణ్యం భిస్తుంది.
తెంగాణ రాష్ట్రము:
    మూసీనది రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో జన్మించింది. తూర్పుగా ప్రవహిస్తూ వచ్చి హైదరాబాదులో       ఉస్మాన్‌సాగర్‌ చెరువులో

కుస్తుంది. తిరిగి అక్కడి నుండి ముందుకుసాగి న్లగొండ జిల్లాలో 64 కిలో మీటర్లు ప్రవహించింది. ఆలేరు నదిని  తనలో కుపుకొని ఆగ్నేయదిశగా

ప్రవహిస్తూ వజీరాబాదు దగ్గర కృష్ణవేణిలో కుస్తుంది. దీనికే ముచుకుంద అనే పేరుంది. కృష్ణమ్మ తల్లి పొడవు 1440 కిలో మీటర్లు. ఆంధ్రప్రదేశ్‌

తెంగాణాల్లో కలిపి 720 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంది.
శ్రీ జోగులాంబ దేవాయం ` అంపురం
    మహబూబ్‌నగర్‌ జిల్లాలో  కర్నూు పట్టణానికి సుమారు 27 కి. మీ. దూరంలో  అంపురం ఉంది. ఇక్కడున్న  నవబ్రహ్మ ఆయాు

అధ్యాత్మికంగా, శ్పిపరంగా ప్రసిద్ధి చెందాయి. నవబ్రహ్ము ప్రతిష్ఠించినట్టుగా  చెప్పబడుతూ వున్న శివాయాల్లో ప్రధానదైవం శ్రీ బాబ్రహ్మేశ్వరస్వామి. ఈ

ఆయంలో మహాశక్తి శ్రీ జోగులాంబదేవిగా కొువై ఆరాధనందుకొంటూ ఉంది. తుంగ, భద్రనదు  కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో అంపురం ఉంది. ఈ క్షేత్రం

 అష్టాదశ శక్తి పీఠాలో ఒకటి. అంపురంకి ఉత్తర వాహినిగా తుంగభద్రా నది ఉంది. ఇక్కడి బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక మొదలైన

64 ఘటాున్నాయి. ఈ అంపురాన్ని దక్షిణకాశిగా పిుస్తారు. జోగులాంబ పీఠాన్ని ఆదిశంకయి సందర్శించారని చెబుతారు.

బీచుపల్లి వీరాంజనేయ స్వామి ఆలయం :
    బీచుపల్లి తెంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో అంపూర్‌ తాుకాలోని కొండపేటకు 1 కి. మీ.  దూరంలో కృష్ణాతీరంలో ఉంది. బీచుపల్లి

ఒకానొకప్పుడు కణ్వాశ్రమ ప్రదేశంగా పిువబడేది. అందుకు నిదర్శనం కణ్వమహర్షి సమాధికూడా ఇక్కడే   ఉంది. దక్షిణభారతంలో కణ్వమహర్షి,

అగస్త్యుడు, వ్యాసుడు, సప్తఋషు ఇక్కడ నివసించినవారే.
గురజా :
    సంగమేశ్వరం దాటిన పిదప కృష్ణానది గురజా శివారులో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రవహించింది.  గురజా కృష్ణాతీరంలో

కాఢలింగేశ్వరాయముంది.
కృష్ణా స్టేషన్‌
    ఇది మక్తల్‌ తాుకాలోని మాగనూరు మండంలో గ గ్రామం. క్రీ. శ. 1892 లో ఇక్కడ కృష్ణానదిపై రైల్వే బ్రిడ్జి పడిరది. ఈ కృష్ణా స్టేషన్‌ దత్తక్షేత్రంగా

ప్రసిద్ధి పొందింది. ఈ ఆయాలే కాక ఇక్కడ క్షీరలింగేశ్వరస్వామి వారి ఆయం ఎంతో ప్రసిద్ధంగా ఉంది.
    కృష్ణాస్టేషన్‌కు 1 కి. మీ. దూరంలో  ఇందువూరుంది. ఇక్కడ స్వామి శంకరానందగారి మఠముంది. కృష్ణా స్టేషన్‌కు 7 కి. మీ. దూరంలో

కుసుమూరు అనే ప్రదేశముంది. ఇక్కడ కృష్ణ ద్వైపాయనువారి బృందావనం ఉంది.
కురుగడ్డ క్షేత్రం :
    శ్రీపాద శ్రీ వ్లభువారు కాకినాడకు సమీపమున గ పిఠాపురమున జన్మించుట ఆంధ్రదేశమొనర్చుకున్న పుణ్యమని చెప్పాలి. వారు కురుగడ్డ

అనుచోట తన శాశ్వత మజిలీనేర్పాటు చేసుకొనిరి. ఈ తెంగాణ రాష్ట్రమందలి మహబూబ్‌నగర్‌ జిల్లాయందు కృష్ణానదిలోని ంకప్రదేశము. ఈ కురుగడ్డ

పుణ్యక్షేత్రమున నేటికిని శ్రీవారు అక్కడ ఉండుటను భక్తు గమనించవచ్చును.
నారద గడ్డ :
    ఇది కృష్ణానదిలోని మరొకదీవి.  దీనిపై శివప్రతిష్ఠ మరియు చెన్న బసవేశ్వర ప్రతిష్ఠ ఉన్నవి. ఇక్కడ    ఉన్న శివాయం ప్రాచీన ప్రతిష్ఠి. తర్వాత

కాంలో ఇక్కడ చెన్నబసవేశ్వరుని ఆయం వెసింది. బసవేశ్వరుని వీరశైవు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు.
చిన్న అగ్రహారం
    ఇది రామావధూత అనే యోగిచేత ఏర్పడిరది. అగ్రహారమనగా శివకేశవాయాు రెండున్న గ్రామమని అర్థం. రంగాపురం కూడా కృష్ణాతీరమే.

ఇది బీచుపల్లి బ్రిడ్జికి చేరువలో ఉంది. ఇక్కడ హనుమదాయముంది.
యాపర్ల అనేది  వనపర్తి తాుకాలోని పెబ్బేరు మండంలో గ గ్రామం.
మురుమునగా అనే ప్రాంతానికి మార్కండేయక్షేత్రమని పేరుంది.
బిక్కెం అనేది కొల్లాపురం తాుకాలోని కృష్ణాతీరప్రాంతం. ఇక్కడ మార్జామఖి అనే దేవత బిక్కేశ్వరుడనే శివుడున్నారు.
జటప్రోు వద్ద జటాయువు యొక్క రెక్క శ్పిం ఉండేదట. భవిష్యోత్తరంలోని విష్ణురహస్యఖండంలో మదన గోపా మహాత్మ్యం పేర  ఈ క్షేత్రం  యొక్క

వృత్తాంతం వస్తుంది.
రామతీర్థమనేది కొల్లాపురం తాుకాలోని పెంటపల్లికి 3 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ రామలింగేశ్వరాయం ప్రసిద్ధి.
మంచాకట్ట అనేది కొల్లాపురం తాుకాలో కృష్ణాతీరంలో గ ప్రాచీన గ్రామం. ఇక్కడ మాధవస్వామి ఆయం ప్రసిద్ధం. ఇది పూర్తిగా మధన గోపా స్వామి

ఆయం వలెనే ఉంటుంది.
కొల్లాపురం తాుకాలోని కృష్ణాతీరంలో అగస్తేశ్వరం, మల్లేశ్వరం, సోమేశ్వరం అనే క్షేత్రాు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
మల్లేశ్వరం అనేది అగస్తేశ్వరాయం తర్వాత దానికి పక్కగా ఏర్పడిరది. అగస్తేశ్వమల్లేశ్వరాు రెండిపుడు కృష్ణలో మునకకు గురికావడం వ్ల ప్రభుత్వం

ఆయాను మదనగోపా స్వామి ఆయం వెనుక రోడ్డుకు అవతలివైపు నిర్మించింది. ఇపుడీ సముదాయంలో మొత్తం 17 ఆయాున్నవి. ఈ జిల్లాలో ఇంత

పెద్ద ఆయ సముదాయం మరొకటి లేదు.
గొందిమ్ల మరియు కూడలి అనేవి అంపురంకు చెందిన గ్రామాు.
సోమశి అనేది కృష్ణాతీరంలోని మరొక ప్రసిద్ధక్షేత్రం.
మద్దిమడుగు అనేది అచ్చంపేట తాుకాలోని గ్రామం.
వాడపల్లి శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయం: వాడపల్లి అనేది ఒకప్పుడు రాజు నివాసస్థం. వాడపల్లిలో రాజుకోట ఇప్పటికీ ఉన్నది. రాజు ప్రాభవంతో విసిల్లిన ఈ

ప్రాంతంలో కృష్ణా మూసీ నదు సంగమప్రదేశంలో క్రీ.శ. 14వశతాబ్దంలో శ్రీ క్ష్మీనరసింహ ఆయం నిర్మంచినట్లు శాసనాధారము తొపుతున్నది. ఇక్కడి

మరో మహిమాన్విత దేవాయం శ్రీ క్ష్మీ నృసింహాయం. ఈ గర్భగుడిలో స్వామి ముఖానికి సమానమైన ఎత్తులో ఒక  దీపం, దానికి కాస్త తక్కువ

ఎత్తులో మరో దీపం మెగుతూ                         ఉంటాయి. స్వామి ముఖానికి పదురుగా ఉన్న జ్యోతి గాలి తగుతున్నట్లు నిత్యం కదుతూ

కనిపిస్తుంది. కిందివైపుగా ఉండే దీపం మాత్రం నిశ్చంగా ఉంటుంది. ఈ రెండు దీపాు స్వామి ఉచ్ఛ్వాస, నిశ్వాసకు ప్రతీకని చెబుతారు. కృష్ణలో

స్నానమాచరించిన అనంతరం యాత్రీకు దర్శించుకునే ఆయాలో నల్గొండ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది ఆయం.
మట్టపల్లి ` శ్రీయోగానందక్ష్మీనరసింహస్వామి ఆయం: ఈ ప్రాచీన క్షేత్రంలో ప్రత్యక్షంగా కొండగుహల్లో శిలాఫకంపై శ్రీ నృసింహుడు పద్మాసనాసీనుడై

అనాదిగా మహర్షు పూజందుకొనుచు తంగెడ ప్రభువు శ్రీ మాచిరెడ్డి స్వప్నమున తన ఉనికిని, వృత్తాంతమును తెలిపి గుహ నుండి బహిర్గత

మొనరింప జేసికొనుటయే ఈ క్షేత్ర చరిత్రకు గ ప్రాధాన్యత! శిలా శాసనంపై చెక్కబడిన దేవనాగరి లిపి భాష ననుసరించి ఈ క్షేత్రం 1100 సంవత్సరా కాం

నాటిది. అతి ప్రాచీనమైన అత్యంత ప్రభావ సంపన్నమైన స్వయంవ్యక్త శ్రీ నరసింహ క్షేత్రం. ఇదెంతో గణణీయమైనది. కృష్ణాతీరమున మెగొందుచున్న

వాడపల్లి, కేతవరము, వేదాద్రి, మంగళగిరి మొదగునవి సుప్రసిద్ధ నృసింహ క్షేత్రాు.
కర్నూు ` శ్రీశై క్షేత్రము : కృష్ణవేణీ నాభీస్థమైన శ్రీశైం మహాపుణ్యక్షేత్రం.
            స్మరణాత్‌ సర్వ పాపఘ్నం దర్శనాత్‌ పుణ్యదాయినీమ్‌ ।
            స్నానేన ముక్తిదామ్‌ కృష్ణాం వాహినీం, ప్రణమామ్యహమ్‌ ॥
    అని స్కంద పురాణంలో కృష్ణానదీ మాహాత్మ్యాన్ని గురించి పేర్కొనబడిరది. ‘‘శ్రీశైం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’’ - దర్శించినంత

మాత్రమునే పునర్జన్మ వుండని దివ్యక్షేత్రం శ్రీశైం. కర్నూు జిల్లాలో కర్నూుకు దాదాపు 180 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో శ్రీశైం వుంది. ఇక్కడ

వెసిన పరమశివుడు జ్యోతిర్లింగరూపుడై శ్రీమల్లికార్జునుడుగా ఆరాధింపబడుతూ వుండగా -
            సంధ్యారంభ విజృంభితం శ్రుతి శిరః స్థానాంతరాధిష్టితం
            స ప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం ।
            భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్క ృతం
            సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివా-లింగితమ్‌ ॥ (శివానందహరి)
    అమ్మగన్న అమ్మ శ్రీభ్రమరాంబాదేవి అష్టాదశ శక్తి పీఠాలో ఒకటిగా పూజందుకుంటూ వుంది. అరుణాసురుడనే రాక్షసుని భ్రమరము

రూపంతో సంహరించి భ్రమరాంబాదేవి అయిందని పురాణ కథనం. స్వామివారి ఆయానికి వెనుకభాగంలో ఎత్తులో భ్రమరాంబాదేవి ఆయం ఉంది.

ఆయ కుడ్యాు, స్థంభాు శ్పిశోభితమై అరారుతూ వుంటాయి. ఆదిశంకరాచార్యు ఈ ఆయాన్ని దర్శించి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారా వ్ల

తొస్తోంది.
    పన్నెండు జ్యోతిర్లింగ పరంపరలో పరమ శివుడు మల్లికార్జునునిగా లింగమై వెసిన దివ్యక్షేత్రమే శ్రీశైం. అనాదిగా శ్రీశై మ్లన్నను శరణన్న జాు

... కరుణించి కష్టాను తీరుస్తాడని ప్రతీతి. మహాశక్తి పీఠమైన ఇక్కడ జగన్నాయకి శ్రీశైక్షేత్ర భ్రమరాంబాదేవిగా అవతరించింది. మరెక్కడా లేని విధంగా

జ్యోతిర్లింగ, మహాశక్తి పీఠం ఒకే ప్రాంగణంలో వెసినది శ్రీశైక్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సీతాసమేతులై శ్రీశైనాథుని

సేవించి ఆయప్రాంగణంలో సహస్ర లింగాను ప్రతిష్ఠించారని ద్వాపరయుగంలో పాండవు వనవాస సమయంలో ఈ క్షేత్రంలో కొంతకాముండి

సద్యోజాతాది పంచలింగాను ప్రతిష్టించారని మరో పురాణ కథనం. స్థానికంగా వుండే చెంచు శ్రీశైం మల్లికార్జునుని తమ అు్లనిగా భావిస్తారు. వారు

మల్లికార్జునుని ‘చెంచు మ్లయ్య’, ‘చెంచు మ్లన్నా’ అని వ్యవహరిస్తారు. నేటికీ స్వామివార్ల ప్లకీ సేవలో చెంచులే పాల్గొని దానిని మోస్తూ వారిభక్తిని

చాటుకుంటున్నారు.
    17వ శతాబ్దంలో మహారాష్ట్ర చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఒకసారి యుద్ధంలో అపజయాన్ని పొంది విరక్తితో శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబాదేవిని

అర్చిస్తూ తపమాచరించాడట. ఆ తల్లి ప్రత్యక్షమై ఆయనకు భవానీదేవి ప్రసాదించిన ఖడ్గాన్ని తిరిగి తన ఆశీస్సుతో అందజేసిందట. అప్పుడే శివాజీకి

తన కర్తవ్యం గుర్తుకు వచ్చి హిందూధర్మరక్షణస్ఫూర్తిని పొందాడట. ఆయ ప్రాకారానికి ఉత్తరాన శివాజీ నివసించిన భవనంగా చెప్పబడుతూ అక్కడ 50

ఏళ్ళ పూర్వం ఒక కట్టడం శివాజీ స్ఫూర్తికేంద్రం కోట్లాది రూపాయతో నిర్మించబడి ఇప్పుడు పర్యాటకును ఆకర్షించుచున్నది. పుష్కరా యాత్రికు తప్పక

దర్శించవసిన కేంద్రం.
    తూర్పు వైపున వుండే రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయు నిర్మించినట్లుగా చెబుతారు. దక్షిణ గోపురాన్ని రెండవ హరిహర రాయు

కట్టించినట్టుగా తొస్తోంది. ఉత్తరంవైపు గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించినారు.
    భీముని కొను, ఇష్టకామేశ్వరీదేవి, అక్కమహాదేవి గుహు వంటి ఎన్నో పవిత్రస్థలాతో కూడిన శ్రీశై క్షేత్రం నిత్యం ఆధ్యాత్మికతతో

తొణికిసలాడుతుంది. 1750 సంవత్సరమున అత్తూరి పాపకవి అనునతడు శ్రీశైఖండమను సంస్కృత గ్రంథమును శ్రీశై మహాత్మ్యము అను పేరుతో

తెనిగించి యున్నాడు.
సంగమేశ్వరక్షేత్రం : ఇక్కడ భవనాశినది కృష్ణానదిలో కలిసేముందు వేణీ, తుంగ, భద్ర, భీమ, మలాపహారిణి అనే నదు కుస్తాయి. ఈ తీర్థం

నందికొట్కూరునకు 13 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ క్షేత్ర స్వామిని భీమలింగమంటారు.
ఆంధ్రప్రదేశ్‌ `  విజయవాడ
    విజయవాడను పూర్వం విజయవాటికాపురమని పిలిచేవారు. కృష్ణానది బీజాపూర్‌ జిల్లాలో పారేటపుడు ఘటప్రభ, మప్రభ అనే రెండు చిన్న

నదువచ్చి అందులో కుస్తున్నాయి. రాయచూర్‌ ప్రాంతం దాటాక కృష్ణానది ముఖ్యఉపనది అయిన భీమానది వచ్చి కుస్తోంది. షోలాపూర్‌ ప్రాంతం

గుండా ప్రవహించిన తర్వాత తుంగభద్రానది వచ్చి కృష్ణానదిలో కుస్తోంది. వజీరాబాద్‌ వద్ద మూసీనది వచ్చి కృష్ణలో కుస్తోంది. భీమ, తుంగభద్రా

నదును కుపుకొని కృష్ణానది నాగార్జునకొండ ప్రక్కగా ప్రవహిస్తూ వచ్చింది.
    తెంగాణలోని హైదరాబాదువలె ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విజయవాడ. శాతవాహన సామ్రాజ్యం పతనం అయిన తరువాత ఇక్ష్వాకు,

బృహత్పలాయను, ప్లవు, శాంకాయను, విష్ణుకుండిను తూర్పు చాళుక్య, చాళుక్య చోళ, వెనాటి చోళ, కాకతీయ,  ముసునూరి, కొండవీటిరెడ్డి గజపతి,

విజయనగరాది రాజవంశీయు ఈ ప్రాంతాన్ని పాలించారు. బెజవాడ తొలినామం పెచ్చవాడ అని, అది క్రమంగా వెచ్చవాడ, బెజ్జవాడగా రూపాంతరం

చెందిందని, ఆ తర్వాత విజ్జవాడగాను, విజయవాడగానూ నామాంతరం పొందినదని చరిత్రకాయి చెబుతారు. తూర్పు వేంగీచాళుక్యు కాంలో

విజయవాడ పేరుపొందిన పట్టణం. వేంగీ చాళుక్యు ఈ పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకొని పాలించారు. మూడవ విజయాదిత్యుని పరిపానా కాంలో

విజయవాడ చాళుక్యు రాజధానిగా ఎంతో వైభవంగా విసిల్లింది. కృష్ణదేవరాయు తన దిగ్విజయ యాత్రతో బెజవాడ, కొండపల్లిని వశం చేసుకొన్నాడు.

గుళ్లు, గోపురాకు ప్రాచీనకాం నుంచీ ప్రసిద్ధి చెందినది విజయవాడ. తూర్పు చాళుక్య రాజు, జైన, శైవ మతాు రెండిరటికీ ప్రాముఖ్యం ఇచ్చి

ఆదరించారు.
    రెండు పర్వత శ్రేణు మధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణవేణీ నది ఈ పర్వతాలో వుండే గుహాయాు, సంఘారామాతో శోభిల్లే

విజయవాడను ధార్మిక, వాణిజ్య కేంద్రంగా తీర్చి దిద్దుతోంది. అష్టాదశ శక్తి పీఠాలో ఒకటైన శ్రీ కనకదుర్గాదేవి ఆవాసమైన పుణ్యక్షేత్రం ఇది. కృష్ణానదిని

ఆనుకొని ఉన్న ఇంద్రకీలాద్రి మీద స్వయం శక్తి అయి వెసిన కనకదుర్గాదేవి ఈ నగర అదిష్ఠాన దేవత. శాతవాహను, ఇక్ష్వాకు కాంలో విజయవాడ

యాత్రా కేంద్రంగా వుండేది. కృష్ణానదీ ముఖద్వారంలో ఉన్న ఘంటసా మీదుగా విదేశీ యాత్రికు పడవల్లో అమరావతి, ధాన్యకటకం, విజయపురిలాంటి

బౌద్ధ కేంద్రాకి ప్రయాణంచేస్తూ విజయవాడలో విడిది చేసి విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం సాగించేవారు. క్రీ. శ. 639 లో చైనా యాత్రికుడు

హ్యూయాన్‌త్సాంగ్‌ మనదేశం వచ్చినపుడు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించారు.
    భగవత్పాదు ఆదిశంకయి భారతదేశమంతటా పర్యటించి ప్రధాన ప్రదేశాలో అష్టాదశ పీఠాను స్థాపించారు. ఆంధ్రదేశంలోని పిఠాపురంలో

పురుహుతికాశక్తి, విజయవాటికలో కనకదుర్గాంబ సుప్రసిద్ధమైనవి. శక్తి పీఠానికి స్థానం గనుక పీఠికాపురమనే పేరు. విజయాంబ అనే నామాంతరం గ

దుర్గాదేవి కావాసం గనుక విజయవాటిక అని పేరు ఈ పట్టణాకు వచ్చాయి. 2500 ఏళ్ళక్రితం బుద్ధభగవానుడు అవతరించి బౌద్ధమతాన్ని స్థాపించాడు.

కొంతకాం విజయవాటిక బౌద్ధధర్మానికి, జైనమతానికి కేంద్రమయింది. కనకదుర్గ అని పేరు రావడానికి కొన్ని కథనాున్నాయి. నాగార్జునాచార్యుడు

ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి రసయోగాన్ని సాధించారట! అంటే బంగారం చేయడం ఆయనకిక్కడ తెలిసింది గనుక అమ్మవారిని బంగారుతల్లి అని

పిలిచి వుండవచ్చు.  కనకదుర్గాదేవి కటాక్షాు మహాకావ్య క్పనకు ఉద్బోధకాు.
            అమ్మగన్న యమ్మ ముగురమ్మ మూపుటమ్మ చాబె
            ద్దమ్మ సురారుమ్మ కడుపాఱడిబుచ్చినయమ్మ దన్నులో
            నమ్మిన మ్పేమ్మమనమ్ము నుండెడియమ్మ దుర్గ మా
            యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదన్‌ ॥
    శ్రీకృష్ణదేవరాయు కళింగదేశ విజిగీషమనీషతో జైత్రయాత్ర ప్రారంభించి విజయవాటికలో దుర్గాదేవి పాద సన్నిధిలో విశ్రమించి ఆ

జగన్మాతనర్చించాడు. శ్రీకాకులాంధ్ర విష్ణువు నర్చించాడు. ఆ రాత్రి చతుర్థయామమున స్వవ్నంలో ఆ స్వామి ప్రత్యక్షమై వేంకటేశ్వరస్వామి

పాదాకంకితంగా భక్తిరస ప్రబంధ నిర్మాణమునకుపక్రమింపుమని ఆదేశించాడు. రాయు ఆంధ్రవిష్ణువునానతిని శిరసావహించాడు. ఆంధ్ర

పంచకావ్యములో ఒకటై, ఉత్తమ ప్రబంధంగా గణుతికెక్కిన ఆముక్త మ్యాదకు విజయవాటిక పుట్ట్లిు. ఈ ఇంద్రకీలాద్రి గురించి ఇక్కడ కిరాత రూపంలో

వచ్చిన శివునితో అర్జునుడు పోరాడి పాశుపతాస్త్రాన్ని గెలిచిన సంఘటనను గురించి కిరాతార్జునీయం కథ ఈ గుడిలో శ్పిరూపంలో నెకొని ఉంది. ఆ

కథ ఇది.
    పాండవు వనవాసం చేస్తూ ఉండగా వేదవ్యాసుడు వచ్చి పాశుపతాస్త్ర సిద్ధికై మహాశివుని గురించి తపస్సు చేయమని వారికి ఉపదేశించాడు.

అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రిపై ఒంటికాలిమీద  నిలిచి ఘోరతపమాచరించాడు. అర్జునున్ని పరమేశ్వరుడు పరీక్షింపదచి కిరాతవేషం ధరించి

అడవిపందిని తరుముకుంటూ అర్జునుని ముందుకొచ్చాడు. అడవిపందిని చూసి అర్జునుడు ఒక్క బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుడు

మరో బాణంతో  దానిని కొట్టాడు. పందిని చేను చంపానంటే నేను చంపానని ఇద్దరూ తగాదా పడ్డారు. ఈ ఘర్షణ ముదిరి వారి మధ్య పోరాటానికి

దారితీసింది. చివరకు అర్జునుడు ఆ కిరాతుడే పరమేశ్వరుడని గ్రహిస్తాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. ఈ గాథకు

తార్కాణంగా అర్జునుడు విజయేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు.

కృష్ణానదీతీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపర్వతంపై వేంచేసి వున్న కనకదుర్గామాత స్వయంభువు.  ఈ ఆయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి

అగస్త్యువారు తమ తపః ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంయి విచ్చేసి శ్రీచక్రంలోని

రౌద్రబీజాు తొగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తు అభీష్టాు నెరవేరుస్తున్నదని చెబుతారు.
    దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం శివుని వద్దనుంచి త్రిశూం, విష్ణువు నుంచి చక్రం, యముని చేత కాదండం, వరుణినిచేత శంఖం,

అగ్ని చేత బల్ల్లెం, వాయువు చేత బాణాు అంబుపొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమా, సూర్యునిచేత కిరణాు, శివుని చేత సింహ

వాహనం పొందింది. శ్రీ మహాకాళి, మహాక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లితాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ

మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి. దుర్గామాత ఆయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీుడు అనే

యక్షుడు. శ్రీకృష్ణదేవరాయు రాజ్యము చేయునప్పుడు తప్పక ప్రతి సంవత్సరమీ దేవిని దర్శించెడివాడట.
మాచవరం ` దాసాంజనేయస్వామి ఆయం: భూమిపైన 10 అంగుళా ఎత్తులో బాలాంజనేయుని వలె దాసాంజనేయస్వామి సుందర మందారంగా

గోచరిస్తాడు. సీతారామక్ష్మణు ఆంజనేయస్వామి, నాగేంద్రుడు ఒకే గర్భాయంలో ప్రతిష్ఠించబడి ఉండటం ఎక్కడా చూడం.
ఆగిరిపల్లి-శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయము :    ఈ క్షేత్రమునకు అసు పేరు శోభనగిరి. విజయవాడకు 17 మైళ్ల దూరంలో నూజివీడు పోయే మార్గంలో

ఆకిరిపల్లి (ఆగిరిపల్లి) వుంది. ఇక్కడ శోభనాచ పర్వతం మీద వెసివున్న క్ష్మీనరసింహ స్వామి శోభనాచ స్వామిగా కొవబడుతున్నాడు. ఈ స్వామిని

వ్యాఘ్రనరసింహ స్వామి అని కూడా అంటారు. ఆకిరిపల్లిలో మల్లేశ్వరస్వామి ఆయం, శోభనాచ స్వామి ఆయం, రాజ్యక్ష్మీ ఆయం, కోదండ రామాయం,

వేంకటరమణ మూర్తి ఆయం, వేణుగోపాస్వామి ఆయం వున్నాయి. శోభనాచ పర్వతానికి పశ్చిమంగా వరాహపుష్కరిణి వుంది.
ముక్తేశ్వరస్వామి క్షేత్రము: ముక్త్యా సమీపంలో నున్న కొండపై భారద్వాజమహర్షి ఆశ్రమం నిర్మించి కొంతకామున్నాడు. భారద్వాజ కొండను ఆనుకొని

కొంతదూరం ఉత్తరదిక్కుగా ప్రవహించి, ముక్త్యా గ్రామాన్ని చుట్టి తూర్పుదిశగా ప్రయాణించడంలో కృష్ణానదిని ఉత్తర కృష్ణాగా పిుస్తారు. ఇక్కడ శివుడు

ముక్తేశ్వరుడుగా వెలిశాడు.
వేదాద్రి` శ్రీ యోగానందక్ష్మీ నరసింహస్వామి. ఇది జగ్గయ్యపేటకు 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీ యోగానంద క్ష్మీ నృసింహస్వామి ఇక్కడి

క్షేత్రదైవం. త్రేతాయుగంలో ఋష్య శృంగమహర్షి ఇక్కడ క్ష్మీనరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించాడని స్థపురాణం చెబుతోంది. వేదాద్రి పంచనారసింహ

క్షేత్రం. మూవిరాట్టయిన శ్రీయోగానంద క్ష్మీ నరసింహస్వామి తనపై రెండు చేతుల్లో శంఖచక్రాని, కింది రెండు చేతుల్లో యోగదంతాన్ని ధరించాడు.

కొండమీద పుట్ట జ్వా నృసింహస్వామి స్థానం, నదీతీర్థంలో సాగ్రామరూపంలో నృసింహస్వామి వున్నాడని, నీరు ఇంకినపుడు ఈ సాగ్రామం

కనిపిస్తుందని అంటారు. గరుడాచం అనే గుట్టమీద ఉగ్రనరసింహస్వామి ఆయం ఉంది. కృష్ణానదీతీరంలో వెసిన ఆంధ్రప్రదేశ్‌లోని 64 క్షేత్రాలో వేదాద్రి

ఒకటి. ఇది సత్యయుగం, త్రేతాయుగం నాటి దేవాయం. శ్రీహరి నృసింహావతారంలో హిరణ్యకశిపుడ్ని సంహరించి వేదపురుషుకిచ్చిన మాట ప్రకారం

పర్వత శిఖరం మీద పంచ నరసింహమూర్తిjైు వెలిశాడు. జ్వాలా, యోగానంద, వీర, క్ష్మీ, వేద నరసింహమూర్తున్న ప్రదేశం భరతఖండంలో ఇది

ఒక్కటే. అదియే వేదాద్రి. కారణం బ్రహ్మ, ఋష్యశృంగుడు, మనుమహారాజు, గరుడ, వనదేవత కోరికపై వెలిశాడు.
పెదకళ్ళేపల్లి: శ్రీదుర్గాపార్వతీసమేత నాగేశ్వరస్వామి ఆయం : మోపిదేవి మండంలోని పెదకళ్లేపల్లి గ్రామం  మొవ్వనుంచి 16 కి. మీ.ు పూర్వం

కదళీపురం అనే పేరుతో ప్రసిద్ధి పొందిన పెదకఏళ్లపల్లి క్షేత్రానికి  కృష్ణానది తూర్పుదిక్కుగా ప్రవహించి ఉత్తరవాహినిగా సాగి శ్రీ నాగేశ్వరస్వామి దృష్టి

పడినంతమేర అలాగే సాగి తిరిగి తూర్పువైపుగా ప్రవహించి సముద్రంలో కుస్తుంది.
శ్రీకాకుళం - శ్రీకాకుళేశ్వరస్వామి : శ్రీకాకుము అను శబ్దమునకు అర్థము ఇట్లు కనిపించుచున్నది.  శ్రీ R శోభాయుక్తుడైన, క R బ్రహ్మచేత, ఆకుము R

వ్యాపించినట్టిది. నిజానికి 2 వే సం.  ఆంధ్రదేశ చరిత్ర కృష్ణామండంతోనే ప్రారంభం అయింది. ఈ కృష్ణామండంలోని శ్రీకాకుళం రాజధానిగా చేసుకొని క్రీ.పూ.

రెండవ శతాబ్దంలో శాతవాహను ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వీరు నాుగున్నర శతాబ్దాు ఆంధ్రదేశాన్ని పాలించారు. శాతవాహనశకం వీరి పేర

ప్రారంభం అయిందే.
    శాతవాహనుడు కృష్ణామండంలోని శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని చిరకాం రాజ్యపాన చేశాడు.
ఈ శ్రీకాకుళం మచిలీపట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలో వుంది. ఇక్కడ శ్రీకాకుళస్వామి ఆయం వుంది. శ్రీకాకుళస్వామినే ఆంధ్ర

విష్ణువు అంటారు. ఈయన స్వయం వ్యక్తుడు. ఈయనకు ఆంధ్రనాయకస్వామి అనీ, తొగు రాయడనీ, తొగువ్లభుడనీ పేర్లు ఉన్నాయి. అగస్త్యమహర్షి

శ్రీకాకుళమహావిష్ణు
వును సేవించడానికి ఇక్కడకు వచ్చాడని అంటారు. క్రీ.శ.1519లో శ్రీకృష్ణదేవరాయ వారీస్వామి దర్శనం చేసికొని, ఏకాదశీ ఉపవాసం నిర్వహించి

విజయవాటికలో నిద్రించియుండగా ఆంధ్ర మహావిష్ణువు కలో కన్పించెను. ‘‘కృష్ణరాయా! నీవు సంస్క ృతంలో ఎన్నో కృతు వెయించావు. తొగులో

నాకంకితంగా ఒక కావ్యం చెప్పవసింది.
            ‘‘తొంగదేయన్న దేశంబు తొంగేను
            తొగు వ్లభుండ తొగొకండ
            ఎ్లనృపు గొువ యెఱుంగవే బాసాడి
            దేశభాషందుం దొగు లెస్స’’
    అని అర్ధింపగా తాను ‘‘అముక్తమ్యాద’’ అనే తొగు మహాప్రబంధం రచించినట్లు చెప్పుకొన్నాడు.
ఈ స్వామి వారి పట్ట మహిషి రాజ్యక్ష్మి అమ్మవారు. ఈ క్షేత్రపాకుడు మల్లికార్జునుడు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. స్వామి శంఖచక్రాది ఆయుధాతో

ఊర్ధ్వపుండ శ్రీవత్స లాంఛనాతో విష్ణుస్వరూపుడై రాజ్యక్ష్మీ భూదేవీ సహితుడై ఉంటాడు. శ్రీకాకుళ క్షేత్రంలో దేవహ్రదము, బ్రహ్మహ్రదము, రుద్రహ్రదము,

చక్రతీర్థము,  విష్ణుసూర్య తీర్థాు, పాపవినాశన తీర్థం ఉన్నాయి.
మొవ్వ`వేణుగోపాస్వామి ఆయం: మహాకవి క్షేత్రయ్య మొవ్వగోపా పదాతో ఈ గ్రామం, ప్రత్యణువు పునీతమైంది. ఆయన మువ్వ గోపా పదాు

రచించాడు.
వ్లెటూరు శివాయము` విష్ణ్వాయం: పూర్వ మీ గ్రామాన్ని గోవిందపురమని పిలిచేవాళ్లు. కృష్ణానది యొడ్డున శివాయం, విష్ణ్వాయం రెండూ భక్తుకు

తంగెడిజన్నుగా కోరికు తీరుస్తున్నాయి.
పెదముక్తేవి ` శ్రీ క్ష్మీపతి స్వామి ఆయం: కృష్ణాజిల్లాలోని పెదముక్తేవిలో ఉన్న శ్రీ క్ష్మీపతి స్వామి ఆయం కూడా పురాణ ప్రసిద్ధమైంది.
భావదేవర పల్లి ` శ్రీ భూసమేత శ్రీ భావనారాయణ స్వామి ఆయం: ఈ ఆయం 15వశతాబ్దం నాటిది.ఈ మూర్తి స్వయంవ్యక్తమైన సాగ్రామ

అర్చామూర్తియే. కృష్ణా నది యొక పాయ ఘంటసా వద్ద చీలి మాజేరు మీదుగా హంసదీవి వద్ద సముద్రంలో కలిసేది.
నాగాయంక ` శ్రీ వేంకటేశ్వరస్వామి ఆయం: కృష్ణాజిల్లా నాగాయంక గ్రామం కృష్ణ ఒడ్డున ఉన్నది. ఇక్కడ వంద కొది లాంచీు ప్రతినిత్యం వేకొది

ప్రజను నదికి ఈ వైపునకు ఆ వైపునకు చేరవేస్తుంటాయి.
హంసదీవి - శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాస్వామి ఆయము : త్రివేణీ సాగరసంగమమైన హంసదీవి క్షేత్రం కృష్ణాజిల్లాలో కోడూరుకు ఆరు

కిలోమీటర్ల దూరంలో వుంది. ఒక కొంగ ఇక్కడ త్రివేణీసాగర సంగమంలో స్నానం చేసి ఇక్కడి శ్రీవేణుగోపాస్వామిని దర్శించడం వ్ల ఇది హంసదీవి

అయిందని అంటారు. ఇక్కడి వేణుగోపాస్వామి ఆయంలో శ్రీకృష్ణుడు నీవర్ణమూర్తి. మోపిదేవి నుంచి 28 కి.మీ. ప్రయాణం చేస్తే హంసదీవికి చేరుకోవచ్చు.

కృష్ణాసాగరసంగమ క్షేత్రమైన హంసదీవిలో శ్రీరుక్మిణి, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాస్వామి కొువై ఉన్నారు.
    పడమటి కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణిలో పుట్టిన కృష్ణానది మహారాష్ట్రలో 306 కి.మీ. కర్నాటకలో 482 కి.మీ., తొగు రాష్ట్రాలో 708 కి.మీ.

ప్రయాణించి కృష్ణాజిల్లా కోడూరు మండంలోని హంసదీవి దగ్గర సాగర సంగమం అవుతోంది. అందుకే ఈ ఆయాన్ని కృష్ణా సాగర సంగమ క్షేత్రం అని

పిుస్తుంటారు.

గుంటూరు జిల్లా ` అమరావతి
    కృష్ణానదీ తీరాన గ చారిత్రక పట్టణం అమరావతి పూర్వం బౌద్ధమత కేంద్రంగా భాసిల్లింది. క్రీ. పూ. 200 ప్రాంతంలో ధాన్యకటకాన్ని రాజధానిగా

చేసుకొని ఆంధ్రదేశాన్ని శాతవాహన రాజు పాలిస్తున్న కాంలో అమరావతిలో బౌద్ధస్థూపా నిర్మాణం జరిగింది. గుంటూరు జిల్లాలోని గుంటూరుకు

పశ్చిమంగా 36 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది. పంచారామాలో ఒకటి. దీన్ని అమరారామం అంటారు. ద్రాక్షారామం, క్షీరారామం,

కుమారారామం, భీమారామం అనేవి పంచారామాు. ఒకే శివలింగం ఈ అయిదు ప్రదేశాల్లో ముక్కుగా వున్నట్లు చెబుతారు. అమరారామంలో స్వామి

అమరేశ్వరుడు, దేవి రాజ్యక్ష్మి, అమరావతిలో స్థూపం కాంచీస్థూపంకన్నా పెద్దదని చెబుతారు. అమరావతిలోని శివలింగం పూర్వం ఉన్నతోన్నతంగా

పెరిగిపోతూ వుంటే మంత్ర శక్తితో పైన శీను బిగించి ఆపారని, ఆ శీ నేటికీ ఉందని చెబుతారు. క్రౌంచగిరిమీద వున్న అమరేశ్వరస్వామి ఆయాన్ని బట్టి

తూర్పు భాగానికి అమరావతి అని పేరు వచ్చిందని, పశ్చిమభాగానవున్న ధాన్యకటకం క్రమంగా ధరణికోట అయిందని అంటారు. అమరావతీ

ఆయాన్ని క్రీ.శ. 9వ శతాబ్దిలో తూర్పు చాళుక్యరాజు భీమదేవుడు నిర్మించాడు.  ఆయానికి ఎదురుగా నందీశ్వరుడున్నాడు. ఆయంలోని మూవిరాట్టు

త్లెనిపారాతితో లింగాక ృతిలో 156 అడుగు పొడుగు, 3 అడుగు చుట్టుకొత కలిగి వుంది. మెట్లెక్కి వెళ్ళి అభిషేకం చేయించాలి.ఈ నగరం 6వ శతాబ్దం

వరకు ఆంధ్రరాజు చేత పరిపాలించబడిరది. ఆంధ్ర రాజులైన శాతవాహను వైదికమతావంబులైనా బౌద్ధమతాన్ని బాగా ఆదరించారు. ఆ సమయంలో ఇది

బౌద్ధక్షేత్రంగా వాసికెక్కింది.
    కృష్ణానదీ తీరంలో అమరేంద్రుడే స్వయంగా శివప్రతిష్ట కావించినందువ్ల ఆ ఆయాధిదైవాన్ని అమరేశ్వరుడంటారు. పూర్వం అహ్యతో తాను

చేసిన చీకటి తప్పు పాపాన్ని పోగొట్టుకోవ టానికే ఇంద్రుడీ ఆయ ప్రతిష్ఠ కావించాడని పౌరాణిక గాథ. ఈ అమరావతిని, వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు

చాకాం పరిపాలించాడు. ఆయన అమరేశ్వరస్వామి భక్తుడు. ఆయాభివ ృద్ధి కెంతో దోహదం చేశాడు. కృష్ణానదీతీరంలో ఎన్నో శివలింగాు స్థాపించాడు.

12-10-2015 సంవత్సరమున మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన గౌరవనీయు శ్రీ నారాచంద్రబాబు నాయుడుగారు ఆంధ్రప్రదేశ్‌ నూతన

రాజధానిగా అమరావతిని మన దేశ ప్రధానమంత్రిగారైన గౌరవనీయు శ్రీ నరేంద్రమోడి గారి కరకమలాతో శంఖుస్థాపన చేయడం జరిగింది. నూతన

రాజధాని నిర్మాణ కార్యక్రమాు అతి శీఘ్రంగా నిర్వహింపబడుచున్నవి. బౌద్ధమత సన్యాసు నేటికిని ఈ పరిసర ప్రాంతమును పుణ్యస్థంగా భావించి

దర్శించుచున్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మంగళగిరి వైకుంఠంగాను, అమరావతిని కైలాసంగా తీర్చిదిద్దానే సంక్పంతో విమానమండప

ప్రాకారాన్ని గోపురాను నిర్మించారు.మూడు ప్రాకారాలో సువిశామైన నిర్మితమైన ఈ ఆయం మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు. కాశీ విశ్వేశ్వరుడు,

ఉమా మహేశ్వరుడు, అగస్తీశ్వరుడు, సోమేశ్వరుడు, వీరభద్రుడు, నాగేశ్వరుడు, కోసలేశ్వరుడు, త్రిపుర సుందరీదేవి, జ్వాలాముఖి అమ్మవారి ఆయాతో

పాటు కళ్యాణ మండపం కృష్ణానదీ తీరాన అతిసుందరనందనంగా నిర్మించారు. రెండో ప్రాకారంలో నైరుతీదిక్కున శ్రీశైమల్లేశ్వరుడు, ఈశాన్యమున

చండీశ్వరుడు, ఆగ్నేయమున శ్రీకాళహస్తీశ్వరుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, తూర్పున శ్రీ సూర్య భగవానుడు ఆయాు ఉన్నాయి. శివ,

కేశవ, భేదం లేనట్లుగా వేణుగోపాస్వామి ఆయం క్షేత్రపాకునిగా ప్రతిష్టించబడి ఉండడం విశేషం.
వైకుంఠపురము - వేంకటేశ్వరాయం : ఇది గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి దక్షిణాన కదు. ప్రశాంత ప్రకృతి మధ్య వేంచేసి యున్న శ్రీవేంకటేశ్వరుడు

కుడివైపున పద్మావతి, ఎడమవైపున క్ష్మీదేవితో ఉంటాడు. మందిరానికి పశ్చిమంగా నదీ కాువ ప్రవహిస్తూ ఉండటంతో కమనీయం గానూ,

ఆహ్లాదకరంగానూ, సహజ శీతంగానూ శోభ్లిుతూ భక్తును ఆకర్షిస్తోందీ ఆయ దృశ్యం.
సీతానగరం : ప్రకాశం బ్యారేజి ఆవవైపునగ గుంటూరు జిల్లాలోని సీతానగరంలో కృష్ణానదీ తీరానగ శ్రీ ఆంజనేయస్వామి వారి ఆయం అత్యంత

పురాతనమయింది. ఇక్కడి ఆంజనేయస్వామి స్వయంభువు. ఇక్కడే కోదండరామస్వామి కూడా ప్రతిష్ఠించబడ్డాడు. ఈ ఆయానికి ఎగువన

సోమేశ్వరస్వామి, రాజరాజేశ్వరి మాతు ప్రతిష్ఠింపబడ్డారు. ఆంజనేయస్వామి ఆయానికి ఎగువన నవగ్రహమూర్తు, విఘ్నేశ్వరుడు కూడా ప్రతిష్ఠి
తమై వున్నారు. ఇక్కడే శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌  స్వామివారి ఆశ్రమం మరియు ఇతర సాంప్రదాయిక ఆశ్రమాు,

శ్రీరామకృష్ణ మిషన్‌ విద్యా సంస్థు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడిన స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెంపుల్‌

అడ్మినిస్ట్రేషన్‌ (ూ.I.ు.A.) హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌, సమరసత సేవా ఫౌండేషన్‌ మొదలైనవి ఉన్నాయి. దీనికి పదురుగానే పుష్కరస్నానఘట్టం

ఉంది.
మంగళగిరి`పానకాస్వామి : విజయవాడకు 10 కి. మీ. దూరంలో కృష్ణకు ఆవ, గుంటూరు జిల్లాలోగ మంగళగిరి ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం. శ్రీ

క్ష్మీనారాయణుడు, దేవి రాజ్యక్ష్మి. బ్లెంతో చేసిన పానకం స్వామికి నివేదన చేయడం ఇక్కడి ప్రత్యేకత. భక్తు స్వామి నోటిలో పానకం పోస్తారు. మనం

తీసుకువెళ్లిన పానకంలో సగం పూర్తికాగానే మిగిలింది లోపలికి వెళ్ళదు. అది మనకు ప్రసాదం. త్రేతాయుగంలో రాముడు ఇక్కడ ధ్యానించి ప్రయోజనం

పొందాడని, కృతయుగంలో మంధర పర్వత మథనంలో మహాక్ష్మి ఆవిర్భవించినదని చెబుతారు. ఇక్కడి క్షేత్రపాకుడు ఆంజనేయస్వామి. దూరానికి

మంగళగిరి కొండ ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది. ఇక్కడ స్వామికి కృతయుగంలో తేనె, త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపరయుగంలో పాు,

కలియుగంలో పానకం నైవేద్యమని చెబుతారు. శంఖంతో పానకం స్వామి నోటిలో పోస్తారు. స్వామి సగం స్వీకరించి, సగం భక్తుకు ప్రసాదంగా

అనుగ్రహిస్తాడు. ఆ పానకం స్వామి నోటిలో పోయగానే గుటగుట మని శబ్దం వినిపిస్తుంది.
ఉండవల్లి ` గుహాయాు : కృష్ణాబ్యారేజి ఆవలివైపు గుంటూరు జిల్లాలో ఉన్న ఉండవల్లి గుహాయాు చరిత్ర ప్రసిద్ధమైనవి. ఇవి నాుగంతస్థుగా

వున్నాయి. ఇవి శ్పికళ ఉట్టిపడుతూ ఉంటాయి. మొదటి అంతస్థులో16 మండపాతో ఉన్న గర్భాయంలో నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు,

దత్తాత్రేయుడు, శంకరుని విగ్రహాున్నాయి.
సత్రశా: పూర్వం మహర్షు సత్రయాగాు చేసి ఈశ్వరున్ని కొలిచిన ప్రదేశం కాబట్టి దీనికి సత్రశా అని పేరు వచ్చింది. కృష్ణానదీ తీరంలో వెసిన ఒక

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
మాచర్ల-శ్రీక్ష్మీసమేత చెన్నకేశవస్వామి ఆయము
    గుంటూరు జిల్లా పల్నాడు తాూకా మాచర్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీక్ష్మీసమేత చెన్నకేశవస్వామి దేవాయం పౌరాణికంగాను,

ఆధ్యాత్మికంగాను, చారిత్రకంగాను అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. పశ్చిమాన కొంత దూరంలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది.
    క్రీ.శ. 10వ శతాబ్దిలో కార్తవీర్యార్జునుని సంతతి వాడైన అనుగురాజు పాలించేవాడు. వారి ఇమేపు చెన్నకేశవుడు. అనుగురాజు మరణానంతరం

అతని కుమారుడు నగాముడు రాజయ్యాడు. బ్రహ్మనాయుడు అక్కడ ఇమడలేక నగామరాజు తమ్ముళ్ళతో కలిసి మాచర్లలో వారితో పాలించే

ఏర్పాటు చేస్తాడు. సంతానం లేని వారు శ్రీ చెన్నకేశవస్వామి చుట్టూ ప్రదక్షిణు చేస్తే సంతానం కుగుతుందని భక్తు నమ్మకం. చైత్ర       శుద్ధ పూర్ణిమ

నుంచి మాచర్లలో శ్రీ క్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవాు వైభవంగా జరుగుతాయి.


కృష్ణాతీర పాకు వైభవం
శివాజి :- కృష్ణవేణి తాను పుట్టిన జన్మభూమి మహాబలేశ్వరం నుండి సాగర సంగమం చేసే హంసదీవి వరకు తన ప్రవాహా ప్రస్థానంలో మహారాష్ట్ర,

కర్నాటక, ఆంధ్ర, తెంగాణ రాష్ట్రా భూమును పునీతం చేసింది. తన జన్మస్థానంలోని చక్రవర్తిగా అనాడు అన్ని మతావారికీ పూజ్యనీయుడుగా, ధీశాలిగా

కీర్తింపబడ్డ యోధుడైన శివాజీ క్రీ.శ.1627లో జన్మించాడు. స్వాభిమానం, సాహసం, ధర్మశీత, మూర్తీభవించిన ఈ మరాఠా పీఠం వీరుడ్ని ప్రజు పురాణ

పురుషుడుగానూ, మహాచక్రవర్తిగా ఆరాధించారు. ఆంధ్రావనిలోని కృష్ణామండంలో విస్లిుతూ అశేష భక్తజనావళితో శోభయమానంగా

పూజింపబడుతున్న శ్రీశైంలోని భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామిని శివాజీ దర్శించి కృష్ణవేణి అందాకు ముగ్దుడై పదిరోజు గడిపాడట.
శివాజీ శ్రీశై దేవాయానికి ఉత్తర గోపురం నిర్మించాడని చెబుతారు.
ఆంధ్రభోజుడు : శ్రీకృష్ణ దేవరాయు
    నాగాంబకు నరసరాజు ద్వారా క్రీ.శ. 1465లో జన్మించిన బిడ్డడే శ్రీకృష్ణదేవరాయు. రాయు బ్యాంలోనే ఆంధ్ర, సంస్క ృత భాషలో సాహిత్యజ్ఞానం

సంపాదించి, కర్ణాటక హిందూస్థానీ భాషను కూడా నేర్చుకున్నాడు. తిమ్మరసు వద్దనే రాజనీతి, దండనీతి మొదగు రాజతంత్ర విధానాలో ఆరితేరాడు.
    రాయు విష్ణుభక్తుడై వేంకటేశ్వరుని, అహోబి నృసింహుని, సింహాచలేశ్వరుని దర్శించి, మతసహనముతో అన్ని మతసును ఆదరించాడు.

1515లో హంపీదేవాయాన్ని నిర్మించాడు. భువనవిజయమనే ఆస్థాన మండపాన్ని నిర్మించి అందులో రాయు తరచుగా సమావేశాు ఏర్పాటు చేశారు.

రాయు నీటివనరును ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, ఆదాయాన్ని బట్టి పన్ను వసూుచేశాడు. రాజ్యంలో దేశరక్షణ,

వర్తక, వ్యాపారాను వ ృద్ధి చేశాడు. ప్రధాన న్యాయపానాధికారి బాధ్యతు చేపట్టి దేశమంతటా న్యాయధర్మాు నెకొనేటట్లు చేశాడు. మహారాజుగా

మహాకవిగా, మహాదాతగా, మహాబశాలిగా ప్రసిద్ధికెక్కిన కృష్ణదేవరాయు ఆంధ్ర సామ్రాజ్యం కృష్ణా, తుంగభద్రా నదు అంతిమ స్థానాు వరకు విస్త

ృతంగా యుద్ధాు చేసి, రాజ్యాన్ని విస్తరించి ఆంధ్రభోజుడుగా కీర్తి సంపాదించాడు.
రెడ్డి రాజు :  కాతీయ సామ్రాజ్యం అస్తమించిన తర్వాత ఒక శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించినవారు రెడ్డి రాజు. కృష్ణానది దక్షిణ తీరాన అద్దంకి,

కొండవీడు, వినుకొండ రాజ్యాు ఉన్నాయి. అంతవరకూ ఆ ప్రాంతాన్ని సురక్షితంగా తన బాహుబంతో సామ్రాజ్యం తరఫున కాపాడుతున్న వ్యక్తి

ప్రోయ వేమారెడ్డి. ప్రోయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. వీరి మొదటి రాజధాని అద్దంకి తరువాత రాజధాని కొండవీడు. ఎర్రాప్రగడ ఇతని

పోషణలో ఉన్న కవి. రెడ్డి రాజ్యాు విజయనగరంలో కలిసిపోయాయి. రెడ్డి రాజుందరూ విద్యావంతులే. సంగీత నాట్యశాస్త్రపారంగతుడు.

వసంతరాజీయమనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. వినుకొండ వ్లభరాయుడు, వెన్నెకంటి సూరన, విన్నకోట పెద్దన, నిశ్శంక కొమ్మన, మడిగి సింగన,

రావిపాటి త్రిపురాంతకుడు, కాశీనాథుడు, ఎర్రాప్రగడ మొదలైన కవు ఈ కాంలో ఉన్నవారే. రెడ్డి రాజు శైవమతస్థు.
రాచకొండ నేలిన పద్మనాయకు: పద్మనాయకు క్రీ. శ. 14వ శతాబ్దంలో కృష్ణా మండంలోని న్లగొండ జిల్లా, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూమండలాన్ని

పాలించారు.
    పనాటి సీమలో అనుగురాజు గుఱజా రాజధానిగా చేసికొని బ్రహ్మనాయుణ్ణి మంత్రిగా నియమించాడు. బ్రహ్మనాయుడు గుండెధైర్యం కవాడు.

మహామేధావి. రాజకీయ చతురత, యుద్ధకౌశం, మూర్తీభవించిన ధీశాలి. అందుకే బ్రహ్మన్న పనాడుసీమ ప్రజకు పరమాత్ముడంతటి వాడయ్యాడు.

బ్రహ్మనాయుడు వైష్ణవ భక్తుడు కావటం చేత చెన్నకేశవాయం మాచర్ల రాజధానిలో ప్రతిష్ఠ చేశాడు.
కృష్ణాతీరంలో ప్రథమాంద్రపాకుడు ` శాతవాహనాంధ్ర చరిత్రకారుడు: అశోకుని తర్వాత శాతవాహన వంశం అధికారంలోకి వచ్చింది. శ్రీముఖుడు

ఆంధ్రజాతిలోని శాతవాహన కులానికి చెందినవాడు. ఈ శాతవాహనునే శాలివాహను, శాతకర్ణుని కూడా అంటారు. ఈ ఆంధ్రరాజు 31 మంది. సుమారు

450 సంవత్సరాు పరిపాలించాడు.
నాగార్జున కొండపై నివసించిన బౌద్ధపీఠాధిపతి : నాగార్జున కొండ సాగర్‌ ఆనకట్ట నుండి 7 కి.మీ.దూరంలో ఉంది. సుమారు 2500 సం.కు పూర్వం ఈ

ప్రాంతం ఇక్ష్వాకు వంశస్థు పానలో ఉండేది. విజయపురి వీరి రాజధాని. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ విద్యాపీఠం ఉండేది. కళాతపస్వి,

బౌద్ధపండితుడు అయిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఒక బౌద్ధ విద్యాపీఠాన్ని నెకొల్పెను. ఇతని బుద్ధిబమునకు మెచ్చి శాతవాహన రాజైన యజ్ఞశ్రీ

శాతకర్ణి శ్రీపరత్వంపై ఒక విశామైన సంఘారామాన్ని కట్టించి ఇచ్చెను. ఇక్కడ వందకొది బౌద్ధభిక్షువు నివసించుటకు తగిన ఏర్పాట్లు చేయబడినవి.

నాగార్జునుడు ఇక్కడ గురువుగా ఉండి విద్యార్థుకు విద్యను నేర్పించుచుండెను. అప్పటినుండి శ్రీపర్వతము ‘నాగార్జునకొండగా మారెను. దీనికి

నాగార్జున కొండ, నందికొండ, శ్రీపర్వతం అన్న పేర్లున్నాయి.
కూచిపూడి నృత్యదాత నర్తించిన కళాక్షేత్రము
    కూచిపూడి భాగవతు అగ్రహారంగానే పేరొచ్చింది. ఈ గ్రామంలోని పౌరాణిక పెద్దు భాగవతమును తమ నాట్యకళ ద్వారా ప్రదర్శిస్తూ

విస్తరించిన కళగా కూచిపూడి గ్రామం పేరుతో జనస్రవంతిలో మారుమ్రోగింది. కూచిపూడి కళకు పసుమర్తివారు, వేదాంతవారు, దరాÄ్భవారు,

చింతావారు కసి భాగవతు కూచిపూడిగా ప్రసిద్ధి చెందటానికి మూస్తంభాలై నిబడ్డారు. భాగవతంతో ప్రారంభమై రామాయణ, మహాభారత కథలే కాక

అష్టాదశ పురాణ సంహిత గాథు ఈ కూచిపూడి నాట్యం ద్వారా జనస్రవంతికి కృష్ణవాహినిలా ఆంధ్రదేశంలో విస్తరించింది. శ్రీకృష్ణదేవరాయు కూచిపూడి

అగ్రహారాన్ని ఇనాముగా ఇచ్చాడని చెబుతారు.
      సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్యానికి ఆది పురుషుడు, నృత్యకర్త. 15వ శతాబ్దివారు. ఇతను అనాథ, నిరాశ్రయుడు. ఉడిపి ఆనందతీర్ధు

శ్రీకాకుళంలో నెకొల్పిన మఠంలో ఉంటుండేవారు. మహాకవి క్షేత్రయ్య వంటి ఆనాటివారు అక్కడ గజ్జకట్టి పాడినవారే. ఆయన జీవించే వరకు

భాసిల్లినచోట కూచిపూడిలో ఆయన పేర ‘సిద్దేంద్రయోగి’పై గ అభిమానంతో గుర్తుగా సిద్దేంద్ర కళాక్షేత్రం అనే నృత్యకళాశా 1963లో స్థాపించారు.
మహాకవి క్షేత్రయ్య: కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీ కాకుళంకు 5 కి.మీ. దూరంలో మొవ్వ అన్న గ్రామంలో మువ్వ గోపాుని ఆయం ఉంది. మహాకవి

క్షేత్రయ్య అసు పేరు. వరదయ్య. ఇతడు 17వశతాబ్దంవాడు. జన్మస్థం ఈ మొవ్వగ్రామమే.
తుకారాం: పాండురంగన్ని 97 కోట్ల శ్లోకాతో  స్తుతించిన నామదేవుడే తుకారాంగా జన్మించాడని ప్రతీతి.
స్వామిగుప్త: 1891 వ సంవత్సరంలో కర్నూులో జన్మించిన వేంకట స్వామి గుప్తగారు శ్రీయుతు సదాశివశాస్త్రి. గద్వా కృష్ణమాచార్యు, ఇంద్రకంటి వేంకట

సుబ్రహ్మణ్య శాస్త్రి, బుక్కపట్టణం శ్రీనివాసాచార్యు, అనుము విశ్వనాథ శాస్త్రు వద్ద విద్య నభ్యసించిన పిమ్మట జగదాశ్చర్యకరావధాన కవితా సంపన్ను,

అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలైన తిరుపతి శాస్త్రి, వేంకట శాస్త్రు వద్ద కావ్యము, అవధాన విద్య యందలి మెకుమ గ్రహించి అవధానాు

నిర్వహించడం మొదుపెట్టారు.
కృష్ణాతీరంలో చక్రవర్తు ప్రభావం
చక్రవర్తు : శాతవాహను, ఇక్ష్వాకు, విష్ణుకుండిన్యు, పనాడు రాజు, కాకతీయ గజపతు, రెడ్డిరాజు, విజయనగరం దేవరాయు, రాజావాసిరెడ్డి వెంకటాద్రి

నాయుడు, తర్వాత 1770 నుండి బ్రిటిష్‌ వారి అగమనం తరువాత భారత స్వాతంత్య్రం వరకు విశిష్ఠమైన చరిత్ర జరిగింది. గుంటూరు సీమ కొండవీడు,

వినుకొండ, బ్లెంకొండ, అమరావతి, పనాడు, మాచర్ల, గురజా, చేబ్రోు రాజరిక కేంద్రాుగా, జమీందారి సంస్థానాుగా విసిల్లాయి.
కవు:    మహాకవు అ్లసాని పెద్దన, శ్రీనాథుడు, ప్కాురికి సోమన వంటి దిగ్గజము సాహిత్యానికి అంకారమై నేటితరం కవు విశ్వనాథ, నదును

వర్ణిస్తూ కృష్ణాతరంగ నిర్ణిద్రగానముతోడ శ్పిమ్ము తొలి పూజ సేయువారు అని, పాపయ్య శాస్త్రి కోటితీర్థాు, ముక్కోటి దేవతు నీ పైటలో దాచిన వేణీ,

రాణి అంటూ వారి సాహిత్యంలో నేపథ్యం మరియు వారి పదవర్ణనకు ఆధారమయ్యింది. నేటితరం రచయితు వ్రాసే కవితు, గేయాు కృష్ణవేణిని

వర్ణించిన వర్ణను కోక్లొు. సినారె ఒక చరణంలో కృష్ణను కీర్తిస్తూ, ‘కృష్ణవేణీ తరంగిణీ జాతి గుండెjైు సాగరమ్మై రూపు సవరించుకొని నీటి’ అంటూ

కన్య సోయగాు, వర్ణిస్తూ పాటపాడితే ‘నేనీదరినీ నువ్వాదరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అని ప్రేయసీ ప్రియు పాడుకునే పాటను వ్రాసారు ఆత్రేయ.

‘కృష్ణవేణీ తొగింటి అలివేణీ...సిరివేణీ’ అంటూ పాడే పాటలో కృష్ణవేణి కవి సాహిత్యంలో పాళి అయ్యింది. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను... అని

ఇలా ఎందరో కవు సాహిత్యానికి తానే గురువయ్యింది కృష్ణవేణి.
కృష్ణాప్రస్థానంలో మహాకవు: కొట్టరపు తిక్కన, ఎఱ్ఱ్రాప్రగడ, పోతన, ప్లిమఱ్ఱి పినవీరభద్రుడు, శ్రీనాథుడు, అ్లసాని పెద్దన, కవిత్వంపై మోజువున్న

శ్రీకృష్ణదేవరాయు ఇంకా తుకారాం, క్షేత్రయ్య నేటి 20వశతాబ్దపు ఆధునిక కవు, త్రిపురనేని, జాషువా, విశ్వనాథ, కరుణశ్రీ వంటి భక్తి కవుకు కృష్ణవేణి

జప్రవాహం హోరులా వారి కవిత్వం జోరుగా సాగింది.
    కవిబ్రహ్మ ఉభయకవి మిత్రుడు తిక్కనÑ ప్రబంధపరమేశ్వరుడు, శంభుదాసుడు, ఎర్రనÑ ప్రజాకవి యోగి వేమన, కవిసార్వభౌమ శ్రీనాథుడు,

ప్కాురికి సోమనాథకవి, కృష్ణామండంలో పుట్టి పెరిగిన శ్రీనాథకవిసార్వభౌముడు కంటే ముందు అవతరించిన ప్కాురికి సోమనాథకవి. వీరంతా

కృష్ణాతీరవాసులే
ఆంధ్రకవితా పితామహుడు: శ్రీకృష్ణదేవరాయు
            తొగుదే యన్న? దేశంబు దొ గేను
            దొగు వ్లభుండ దొగొ కండ
            ఎ్లనృపు గొువ నెఱుగవే బాసాడి
            దేశ భాషందు దొగు లెస్స
    హంపీ విజయనగర సామ్రాజ్యాధినేత ఆంధ్రభోజుడుగా కీర్తించబడిన శ్రీకృష్ణదేవరాయు ఆస్థానకవులో అగ్రగణ్యుడుగా పేరుపొందిన అ్లసాని

పెద్దన కవి కృష్ణామండం కర్నూు జిల్లా రూపాటిసీమ గ్రామమందు జన్మించాడు రాయవారు. అష్టదిగ్గజకవుగా పేరుపొందిన పెద్దన కవితోపాటు ఇంకా

సప్తకవు నంది తిమ్మన, ధూర్జటి, మ్లన, అయ్యరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వంటి కవుతో గోష్ఠి

కార్యక్రమాు నిర్వహించుచుండెడివారు.
పింగళి సూరన: పింగళి గ్రామం కృష్ణాతీరంలోనినిదే. ఈ మహాకవి అబ్బమ్మ, అమరనార్యుకు పుత్రుడు. శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజకవులో ఒకడు. భారత

రామాయణము రెండర్థము వచ్చు రీతిలో తనదైన శైలిలో పద, శబ్దప్రయోగాు, రసపుష్ఠి కావ్య నిర్మాణం చేసే ఉద్దండ పండితుడుగా మెగొందాడు.
వికట కవి తెనాలి రామకృష్ణుడు: హాస్య సంభాషణా చతురుడు, సమయస్ఫూర్తి గ దిట్టకవిగా ఎంతటి తీవ్ర సమస్యనైనా క్షణంలో ఉపాయం పుట్టించే

వక్తగా, బమ్మిని తిమ్మిని చేయగ అఘటన ఘటనా సమర్థుడుగా తొగు సాహిత్యంలో ఏకైక వికటకవిగా ప్రసిద్ధి చెందిన రామకృష్ణుడు అసుపేరు

రామలింగం. వైష్ణవరాజు రాయ నాశ్రయించినందున ఆయన ప్రీతి కోసం, భుక్తి కోసం, వైష్ణవం స్వీకరించి రామకృష్ణుడయ్యాడు. ఈయన ఇంటిపేరు

గార్లపాటి. జన్మస్థం తెనాలి. జన్మించిన సంవత్సరం 1464. 1510 లో దేవరాయ ఆస్థానంలో స్థానం సంపాదించే సమయంలో ఆంధ్రలోని తెనాలి

రామలింగడుగా హంపి విజయనగరసామ్రాజ్యంలో పిువబడ్డాడు.
కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ:
            కృష్ణాతరంగ నిర్ణిద్రగానము తోడ
            శ్పిమ్ము తొలిపూజ సేయునాడు
            అక్షరజ్ఞాన మెఱుగదో యాంధ్రజాతి?
            విమ కృష్ణానదీ సైకతము యందు
            కోకిపు బాట పిచ్చుక గూండ్లు కట్టి
            నేర్చుకొన్నది పూర్ణిమా నిశియందు
    అని చెప్పుకున్న శ్రీ విశ్వనాథుని జన్మస్థానం నందమూరు,  జన్మదినం సెప్టెంబరు,10, 1895. నిశిరాత్రిలో కూడా కసిగా సంస్కృతాంధ్రీయ శబ్దా బ్దా

లోతు ఎత్తు కూంకషంగా అధ్యయనం చేసి విద్వత్కవిగా పరిపూర్ణుడయ్యాడు. 1970 లో జ్ఞానపీట్‌ పురస్కారం శ్రీరామాయణ క్పవృక్షం గ్రంథరచన ద్వారా

భిస్తే అనంతరం భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ బిరుదునిచ్చి గౌరవించింది.
జంధ్యా పాపయ్యశాస్త్రి:  తొగు సాహిత్య స్రవంతిలో నవరసాలోని కరుణరసం నేపథ్యంగా పుష్పవిలాపం లోని పూగుబుర్లు నోర్లు విప్పి బావురుమని

మనిషిని కరుణతో ప్రశ్నించినట్లు రచించిన కరుణరస కవి. తొగు సాహిత్య కవులో అరుదైన కవి, అరుణకవి, కరుణకవి. కరుణరసం తన కవిత్వశక్తిగా గ

ఆయన కరుణశ్రీ.
మ్లొ : కృష్ణా మండం తెనాలి ప్రాంతానికి చెందిన మట్టితో కుండు చేసే కుమ్మరి ఆతుకూరి కేతన కూతురు మ్లొ. లితకళారాధనకు కుం అడ్డం కాదని

స్వశక్తే గురువుగా, జీవితంలో ప్రపంచమే ఒక పాఠశాగా, సమాజంలో మంచి చెడును గ్రహించి, చదివిన చదువు చిన్నదైనా అవగాహనే కంగా వనకవి,

మహాకవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని 571 పద్య, గద్యాతో 6 ఖండాుగా వ్రాసిన ఒక మహిళా రచయిత్రి కాదు కవయిత్రే ఆమె పేరు మ్లొ.
సింగమనాయకుడు: తెంగాణలోని రాచకొండలో రేచర్ల సింగమనాయకుడు పద్మనాయకు రాజ్యాన్ని స్థాపించాడు. నలోపాఖ్యానం, నవనాథోపాఖ్యానం

మొదలైన ద్విపదగ్రంథాను వ్రాసాడు.
ప్లిమర్రి పినవీరభద్రకవి: శ్రీనాథయుగంలోని మరొక ప్రతిభావంతుడైన కవి ప్లిమర్రి పినవీరభద్రుడు. శారదాపీఠంగా ప్రసిద్ధికెక్కిన పండిత వంశానికి చెందిన

పినవీరన ‘వాణి నా రాణి’ అని చెప్పుకున్నాడని అంటారు. ప్లిమర్రివారి స్వగ్రామం తెంగాణా, నల్గొండజిల్లాలోని ప్లిమర్రి గ్రామం అనీ, ఆ తర్వాత న్లెూరు

వాసుయ్యారనీ తొస్తోంది. పినవీరస అవతారదర్పణం, నారదీయపురాణం, మాఘమహాత్మ్యం, మానసోల్లాససారం రచించాడని చెబుతారు.
సహజ పండితుడు పోతన : శ్రీనాథునికి సమకాలికుడు. పదిహేనవ శతాబ్దికి చెందిన భక్తకవి పోతన బమ్మెర గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం

తెంగాణలోనిది. పోతనకి సహజపాండిత్య అనే బిరుదువుంది. పోతన భాగవతం కాక వీరభద్ర విజయం, భోగినీ దండకం రచించాడు. నారాయణ శతకం

కూడా పోతన రచించాడని చెబుతారు. పోతన రాచకొండనేలిన పద్మనాయకరాజు సర్వజ్ఞసింగభూపాుని ఆస్థానంలో ఉండేవాడని చెబుతారు.

అక్కడున్నపుడే ఈయన భోగినీ దండకాన్ని రచించాడు.
            ఒనరన్‌ నన్నయ తిక్కనాదికవులీ యుర్వింబురాణావశుల్‌
            తెనుగుల్‌ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో
            తెనుగుంజేయరు మున్ను భాగవతమున్‌ దీనిన్‌ దెనిగించినా
            జననంబున్‌  సఫంబు చేసెద బునర్జంన్మంబు లేకుండగన్‌
            పలికెడిది భాగవతమట
            పలికించు విభుండు రామభద్రుండటనే
            పలికిన భవహరమగుటనట
            పలికెద, వేఱొండు గాథ బుకగనేలా?
    పుష్కరా సందర్భంగా సుమారు 219 పుష్కర ఘాట్లలో పుష్కర యాత్రీకు పుష్కర స్నానం చేయుటకు ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ రాష్ట్రాలో కృష్ణానదీ

ప్రవహించు మహబూబ్‌నగర్‌, కర్నూు, నల్గొండ, గుంటూరు మరియు కృష్ణాజిల్లాలోని నదికి అనుసంధానమైన జిల్లాలో పుష్కర రేవు అనువైన

ప్రదేశాు.
    కర్నూుజిల్లాలోని శ్రీశైం ఎడమవైపు, కుడివైపు రేవు, పాతాళగంగ, సంగమేశ్వరం ప్రదేశాు
గుంటూరు జిల్లా లోని అమరావతి, వైకుంఠపురం, సీతానగరం, తంగెడ, గోవిందపురం మున్నగు ప్రదేశాు.
కృష్ణాజిల్లాలోని విజయవాడ, భవానీపురం, ఇబ్రహీం పట్నం, గుడిమెట్ల, చాగంటిపాడు, గ్లొపూడి తదితర ప్రదేశాు.
            సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్‌
            దేవా భాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే     (ఋగ్వేదం)

పుష్కరవిధులు
స్నానవిధి:  సప్తవిధస్నానములో వారుణ స్నానము శ్రేష్ఠమని చెప్పబడిరది. వారుణస్నాన మనగా మంత్రపఠన సహితంగా జమునందు మునుగుట.

వారుణ స్నానమును సముద్ర, నదీ, తటాక, వాపీ, కూప, భాండోదకముతో చేయవచ్చును. కృష్ణానదిలో స్నానం చేయునపుడు...
            కృష్ణే! కృష్ణాంగ సంభూతే! జంతూనాం పాపనాశిని ।
            కృష్ణవేణి! నమస్తుభ్యం పునీహీ స్నానగం జనమ్‌ ॥
    మొట్టమొదట నదులో దిగబోవునపుడు ఈ క్రింది శ్లోకంతో నదిఒడ్డున ఉన్న మట్టిని తీసుకుని నదిలో మూడుసార్లు వేయవలెను.
            పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి ।
            మృత్తికాం తే మయాదత్తాం ఆహారార్థం ప్రక్పయ ॥
    జచరాకు బియ్యపు గింజు వేయవలెను. స్నానము చేయునపుడు నదికి ప్రార్థన చేయవయును.    ఆర్ఘ్యప్రదానాదు ఇవ్వవలెను. స్నానం

అయిన తర్వాత గట్టు ఎక్కేటపుడు మూడు దోస్లితో నీటిని, యక్ష్మకు తర్పణము ఇవ్వవలెను. అంటే నీటిని గట్టుమీద పోయాన్నమాట.
    పుష్కరమునకు సంబంధించిన పుణ్యనదులో పితృదేవతకు శ్రాద్ధకర్మ చేయవయును. ఇదియే పుత్రుకు ప్రధాన కర్తవ్యోపదేశము.

పుష్కరకాంలో పితృదేవత తిథి వచ్చినపుడు ఆ తిథినాడు శ్రాద్దకర్మ చేయుట ఉత్తమము. లేనిచో పండ్రెండు రోజులో ఎన్నడైనను చేయవచ్చును.
దానవిధి:  పిండమును ఎత్తే ముందు పితృదేవతకు పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులోక ప్రాప్తికై బ్రాహ్మణునికి దానము చేయవయును.

పుష్కరకామందు మాత్రమే కాక సర్వకా సర్వావస్థయందు క్షేత్ర తీర్థ దైవ దర్శనము మానవాళికి అభ్యున్నతిని కల్గిస్తాయి.
            కృష్ణవేణి నమస్తుభ్యం శుభే హరిహరాత్మకే ।
            నిర్మితాసి పురాదేవి జగతామఘనుత్తయే ॥
            కృష్ణవేణి! నమస్తుభ్యం సర్వపాప ప్రణాశిని ।
            త్రిలోకీ పావనజలే రంగత్తుంగతరంగిణి ॥
            శంఖచక్రగదాపద్మధారిణీం విష్ణురూపిణీమ్‌ ।
            ఇంద్రనీసమాకారాం కృష్ణాం త్వాం ప్రణతో-స్మృహమ్‌ ॥
            దశకోటి సహస్రాణి తీర్థానాం వై మహామతే ।
            సాన్నిథ్యం పుష్కరే యేషే త్రిసంధ్యం కురునన్దన ॥  (వనపర్వం)
            గగలా గోదావరి కదలిపోతుంటేను
            బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
            బంగారు పంటలే పండుతాయి. (శంకరంబాడి)
    సనాతన హిందూ ధర్మ సంరక్షణకు దీక్షా కంకణధారణం చేసిన ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ కృష్ణాపుష్కరా సందర్భంగా సత్సంగాను,

ఆధ్యాత్మిక ప్రవచనాను, సాధుసమ్మేళనాను, స్ఫూర్పిదేవాయసముదాయాన్ని, ఏకోన్ముఖమైన ధర్మప్రచార కృషిని కొనసాగిస్తోంది. అలాగే శ్రీశ్రీశ్రీ

చినజీయర్‌స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో క్షలాది మందితో 19.08.2016న  శ్రీభగవద్రామానుజ సహస్రాబ్ది స్ఫూర్తిగా ‘‘సమతాస్నానం’ అనే

కార్యక్రమాన్ని సంకల్పించారు. అలాగే శతాబ్దాుగా హిందూ ధర్మానికి అంకితమైన శ్రీహరిభక్తు మా దాసయి, మాదిగ దాసయి తమ సాంప్రదాయిక

వైభవాన్ని ప్రదర్శించబోతున్నారు. ధార్మిక ప్రవాచకులైన మహానుభావు సర్వశ్రీ చాగంటి, సామవేదం, గరికపాటి, కందాడై, వద్దిపర్తి, రాఘవన్‌, మైవరపు

ప్రభృతు తమ ప్రవచనా ద్వారా తీర్థప్రజను అరించబోతున్నారు.
            నమామి సుకృతశ్రేణీం కృష్ణవేణీం తరంగిణీమ్‌ ।
            యద్వీక్షణం కోటిజన్మకృత దుష్కరశిక్షణమ్‌ ॥

Monday, July 25, 2016