Thursday, January 19, 2012

ఒంటరి తనమే నీ బలం!

ఎవరూ లేరని చింత పడకు ........
ఎవరూ రాలేదని బెంగ పడకు....... 

ఉన్నవారందరూ రేపటికైనా పోయే వాళ్ళే.....
ఒకరు ముందు .......
మరొకరు వెనకాల .........
తేడా అదొక్కటే !

ఒంటరి తనమే నీ బలం!
జంట కోరితే కొంత నయం!!

స్వేచ్చ  ఎవరికుందని ?.........
నీకీ లేదనుకుంటున్నావా?......

ఉన్నా ఏం పనికొస్తుందని ?.......
ఉన్నా లేనట్లే .......
లేకున్నా బాగుండేదేమో .......


మనసు పక్షిలా ఎగరాలంటే.....
స్వేచ్చ అక్కర్లేదు...సాహసం కావాలి!   

జీవితమంతా భయం కౌగిట్లోనే .........
అడుగు ముందు కేయాలన్నా అదురే .......

వెనకడుగు  వేసామా........
లోయలోకి జారుడే ...........

నడవ గలిగి కదల లేని స్థితి....... 
ఎంతటి నరకమది ?.........

అవసరమా మనకంతటి పెచ్చు ......
పిచ్చి గాక పోతే పచ్చి నిజం ఇదే కదా !
మరచి పోగలమా .....కలనైనా .......



No comments:

Post a Comment